- ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిన ఓ యువతి
- అబ్బాయిల దిల్ కా థడ్ కన్ …
- ఆమె అందానికి నెటిజన్ల ఫిదా…
- మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ గా ఇండోర్ యువతి
- పెళ్లి చేసుకుంటామంటూ వెంట పడుతున్నఅబ్బాయిలు
- ఇన్ స్టా అక్కౌంట్‌లో మోనాలీసా కు పిచ్చ క్రేజ్
- పుణ్యక్షేత్రంలో ఏంటీ పిచ్చి పనులంటూ మరికొందరి క్లాస్…
ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా సోషల్ మీడియాలో అనేకానేక కారణాలకు సెన్సేషన్ గా నిలుస్తోంది. గంట గంటకూ పెరుగుతున్న రద్దీ, అయినా క్రమ పద్ధతిలో పుణ్య స్నానాలు ఆచరించి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెనక్కు మళ్లుతున్న జనం. ఇదంతా చూసిన వారు యూపీ క్రౌడ్ మేనేజ్ మెంట్ థియరీకి ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నారు. మహాకుంభమేళాలో ప్రతీదీ సెన్సేషనే. మోనాలీసా అనే పూలదండలు అమ్మే అమ్మాయి ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ సెన్సేషన్ గా మారుతోంది. ఆమె ఫోటో చూసిన సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు వామ్మో ఆమె ముందు మేమెంత అని ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు.త్రివేణి సంగమం దగ్గర పూల దండలమ్ముకునే ఇండోర్ కు చెందిన ఓ యువతి ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది. ఆకర్షించే కళ్లు,చామనచాయ రంగు,అందమైన ముఖం, ప్రత్యేకమైన మాటతీరుతో ఆ యువతి అబ్బాయిల పాలిట దిల్ కాథడ్కన్ అయ్యి కూర్చుంది. ఆ యువతి పేరు మోనాలీసా కావడంతో ఇక కుర్రకారు, మగ వారు సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన క్రేజీ ఫ్యాన్స్ గా మారిపోయీరు. మోనాలీసా క్రేజ్ పై సోషల్ మీడియా వేదికగానే పెద్ద చర్చ జరుగుతోంది. ఆమెను నేచురల్ బ్యూటీ అని కొందరు పొగడుతుంటే మరికొందరు పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఆమె గురించి చర్చలేంటి.. ఈ క్రేజ్ ఏంటి అంటూ మరికొందరు విసుక్కుంటున్నారు. శివం బికనీరీ అఫీషియల్ అనే సోషల్ మీడియా అక్కౌంట్ లో ఈ మోనాలీసా ఫోటోను, వీడియోను పోస్ట్ చేయడంతో ఏకంగా 15 మిలియన్ల మంది చూశారు. మరికొందరు ఆమెకు ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ అక్కౌంట్లు ఉన్నాయా అని ఆరాతీశారు.మరో ఇన్ స్టా గ్రామ్ అక్కౌంట్ లో ఆమె కు పెళ్లయ్యిందా అని ఒకరు.. ఎవరైనా అబ్బాయిలు వెంట పడితే ఇష్టపడతారా? వారినెవరినైనా పెళ్లి చేసుకునేందుకు మోనాలీసా ఇష్టపడుతుందా అని మరికొందరు అడిగారు. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ మోనాలీసా చాలా గడుసుగా సమాధానం ఇచ్చింది. అందరూ నాకు సోదర సమానులు. వాళ్లని నేనెందుకు పెళ్లి చేసుకుంటాను. నా తల్లి దండ్రులు చెప్పిన వారినే పెళ్లి చేసుకుంటాను కానీ..అని సమాధానమిచ్చింది.సోషల్ మీడియాలో మోనాలీసా వీడియోలకు ఓ రేంజ్ లో లైక్ లు కనిపిస్తున్నాయి. కొందరు అందాల దేవత అని పొగడుతుంటే మరికొందరు ఆమె అందాన్ని ఎక్స్ పోజ్ చేస్తున్నారంటూ తిట్టి పోశారు. మోనాలీసాపై ప్రశ్నల వర్షం కురిపించిన వారిపై మరికొందరు తిట్టి పోస్తున్నారు. జరుగుతున్న ఈవెంట్ ఏంటి? 144 ఏళ్ల తర్వాత వచ్చిన మహాకుంభమేళాలో ఈ గోలేంటి అంటూ మరికొందరు విసుక్కుంటున్నారు.ఆమె ప్రైవసీని కాపాడండి.. పుణ్య క్షేత్రం దగ్గర ఇలాంటి పనులేంటి అంటూ మరికొందరు క్లాస్ తీసుకున్నారు. మరో నెటిజన్ ఆమె అందంగా ఉండొచ్చు గాక..అయితే ఆమెతో ఇంటర్వ్యూలేంటి? వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమేంటి? కుంభమేళా పవిత్రతను కాలరాస్తున్నారు..బుద్ధుందా? ఆమెకు అనవసర పబ్లిసిటీ ఎందుకు కల్పిస్తున్నారంటూ మండిపడుతున్నారు.అసలు ఇన్ స్టా గ్రామ్ ఎక్కౌంటే లేని మోనాలీసాకు సోషల్ మీడియా రిపోర్టర్లే అక్కౌంట్ ఓపెన్ చేసి ఆమెతో రీల్స్ చేసి పోస్ట్ చేస్తున్నారు. రోజు రోజుకూ ఆమె అక్కౌంట్ కు ఆదరణ పెరుగుతోంది.