జర్మనీలో క్రిస్‌మస్ వేడుకల్లో విషాదం జరిగింది. జర్మనీలోని మగ్డాబర్గ్‌లో క్రిస్మస్ మార్కెట్‌లోకి ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. ఎంత వేగంగా అంటే కారు ఢీకొట్టిన వేగానికి ఇద్దరు మృతి చెందగా.. ఏకంగా 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. కారు నడిపిన వ్యక్తిని ఇప్పటికే జర్మనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని సౌదీ అరేబియాకు చెందిన డాక్టర్‌గా గుర్తించారు. అతడిని 50 ఏళ్ల తలేబ్ అని.. అతను 2006 నుంచి జర్మనీలోనే ఉంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. కారు బారికేడ్లను ఢీకొట్టి ఏకంగా 400 మీటర్ల మేర జనాలను ఢీకొంటూ ముందుకు వెళ్లింది.
ఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. క్రిస్మస్ ట్రీస్, లైట్లతో కోలహాలంగా ఉన్న మార్కెట్.. ఈ ప్రమాదం తర్వాత భయంకరంగా కనిపించిందనే చెప్పాలి. అనుమానితుడు మ్యూనిచ్ నెంబరు ప్లేటు ఉన్న BMW కారును అద్దెకు తీసుకుని.. మార్కెట్‌కు వచ్చినట్టు పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. గాయపడినవారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉందని, 37 మంది తీవ్రంగా గాయపడ్డారని, 16 మందికి స్వల్ప గాయాలైనట్టు డాక్టర్లు తెలిపారు.
అయితే ఈ ప్రమాదం ఉద్దేశపూర్వకంగా జరిగిందా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా? అనే దానిపై జర్మనీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఫోకస్ చేశాయి. అయితే ప్రాథమికంగా ఇందులో ఎలాంటి కుట్ర ఉందని తాము భావించడం లేదని అధికారులు ప్రకటించారు.
అయితే నిందితుడు తలేబ్ సంబంధించిన అనేక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. 1974లో జన్మించిన తలేబ్.. 2006లో జర్మనీలో పర్మినెంట్ రెసిడెన్సీ దక్కించుకున్నాడు. 2016లో అతడిని జర్మనీ ప్రభుత్వం శరణార్ధిగా గుర్తించింది. అతడు పూర్తిగా ఇస్లాంను అనుసరించే పరిస్థితి లేకపోవడంతో జర్మనీకి వచ్చినట్టు తెలుస్తోంది. జర్మనీకి వచ్చిన తర్వాత wearesaudi.net పేరుతో ఓ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి సౌదీ, ఇతర గల్ఫ్ దేశాల నుంచి మాజీ ముస్లింలకు సహాయపడేవాడు.
తలేబ్‌పై సౌదీ అరేబియా వెతుకుతుంది. అతడిపై ఉగ్రవాదం, గల్ఫ్ దేశాల నుంచి ఈయూ దేశాలకు అమ్మాయిలను స్మగ్లింగ్ చేస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. అయితే జర్మనీ మాత్రం సౌదీ అరేబియాకు అతడిని అప్పగించేందుకు నిరాకరించింది. అయితే ఈ విషయాలన్ని అతడిపై అనుమానాలను పెంచుతున్నాయి. కానీ జర్మనీ అధికారులు మాత్రం అతనొక్కడికే ఈ ఘటనతో సంబంధం ఉందని.. అతడిని అదుపులోకి తీసుకున్నామని చెబుతున్నారు.