24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

దక్షిణ కొరియాలో మార్షల్ లా… అధ్యక్షుడు యోల్‌కు పదవీగండం

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్ యోల్‌కు పదవీగండం పొంచి ఉంది. దేశవ్యాప్తంగా మార్షల్ లా ద్వారా అధికార, ప్రతిపక్ష నేతలను కంట్రోల్ లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించి కావాల్సినంత చెడ్డ పేరు తెచ్చుకున్నారు యూన్. ఈరోజు సౌత్ కొరియన్ పార్లమెంట్ నేషనల్ అసెంబ్లీలో అధ్యక్షుడిని తొలగించేందుకు అభిశంసన తీర్మానంపై ఓటింగ్‌కు ఇటు ప్రతిపక్షాలు, అటు అధికార పక్షం కూడా సిద్ధమయ్యాయి. అధికారంలో ఉన్న తన సొంత పార్టీ నేతలు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం కనిపిస్తోంది. అంతకుముందు నార్త్‌ కొరియాకు అనుకూలంగా వ్యవహరిస్తూ… దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని కంట్రోల్ చేసేందుకు మార్షల్ లా విధిస్తున్నానంటూ యూన్‌ ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా నిరసనలు పెరిగాయి. విపక్ష నేతలు మాత్రమే కాదు.. సొంత పార్టీ నేతలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. రాత్రికి రాత్రే పార్లమెంట్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించి మార్షల్ లాను రద్దు చేసేందుకు ఓటింగ్ నిర్వహించారు.

ఆ దేశ పార్లమెంట్‌లో మొత్తం 300 సీట్లు ఉండగా, ప్రస్తుతం అధికార పీపుల్ పవర్ పార్టీకి 108 సీట్లు ఉన్నాయి. ప్రతిపక్షంలోని అన్ని పార్టీలకు కలిపి 192 మంది ఎంపీలున్నారు. నిజానికి గత కొన్ని నెలలుగా యూన్‌పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. యూన్ భార్య కిమ్ కియోన్ హీ లక్షా 90 వేల ఖరీదైన లగ్జరీ హ్యాండ్ బ్యాగ్ ను ఓ పాస్టర్ నుంచి లంచంగా తీసుకున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. రెండేళ్ల క్రితం నాటి ఈ ఘటనను పాస్టర్ తన వాచ్ కెమెరాతో రికార్డ్ చేయగా.. ఆ వీడియో గత ఏడాది నవంబర్ లో బయటకు వచ్చింది. దీనిపై దర్యాప్తు జరిపిన ప్రాసిక్యూటర్లు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక ఆ తర్వాత స్టాక్ మార్కెట్ ధరలను ప్రభావితం చేశారని ఇన్ ఫ్లేషన్ పెంచేందుకూ ప్రయత్నించారన్న ఆరోపణలు వచ్చాయి. తాజాగా మార్షల్ లాతో ఆయన కెరీర్‌కే ఓ మాయని మచ్చలా మారింది.

పరిస్థితులు తనకు అనుకూలంగా లేకపోవడంతోనే.. లేకపోతే నిజంగానే రియలైజ్ అయ్యారో తెలీదు కానీ దేశంలో ఎమర్జెన్సీ విధించినందుకు దక్షిణ కొరియా అధ్యక్షుడు పశ్చాత్తాపపడ్డారు. తల వంచి అడుగుతున్నాను. నన్ను క్షమించండి.. మరోసారి దేశంలో ఎమర్జెన్సీ విధించనంటూ ఓ ప్రకటన చేశారు. ప్రభుత్వ పెద్దగా ఉన్న బాధ్యతతోనే ఎమర్జెన్సీ విధించానని వివరణ ఇచ్చుకున్నారు. ఎమర్జెన్సీ విధించినందుకు న్యాయపరమైన విచారణ ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అభిశంసన ఓటింగ్‌కు ముందు వచ్చిన ఈ కీలక ప్రకటన ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com