25.9 C
Hyderabad
Monday, August 3, 2026

Live Video

spot_img

పరస్పర టారిఫ్‌లతో మనకే దెబ్బ

  • దీనివల్ల భారీగా లబ్ది పొందనున్న అమెరికా

  • అమెరికా ఉత్పత్తులపై మనం విధించే టారిఫ్‌ 10 శాతంకన్నా ఎక్కువే

  • మనపై అమెరికా టారిఫ్‌ 3 శాతం మాత్రమే

  • భారత్ విధానం మాకు నచ్చింది.మాకే మంచిది

  • ఇలా పరస్పర విధింపుల వల్ల మార్జిన్ పెద్దగా ఉండదు

  • మా దేశంలో పరిశ్రమలు, ప్లాంట్లు పెట్టుకోవచ్చు

  • మా ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నట్రంప్

  • భారత ఎగుమతులు,దిగుమతుల్లో స్వల్ప మార్పులు

  • కొన్ని రంగాల్లో దిగుమతులపై టారిఫ్‌ లు తగ్గించి

  • రక్షణపరికరాలు, ఇంధన ఉత్పత్తుల దిగుమతుల పెంపు

మేక్ అమెరికా గ్రేట్‌ అగైన్ పేరుతో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు చుక్కలు కనిపిస్తున్నాయి.ఎడాపెడా టారిఫ్‌ల మోత మోగించిన ట్రంప్ ఇప్పుడు అంతకంత టారిఫ్‌ విధానం ప్రకటించారు. ప్రపంచ దేశాలు ఎంత టారిఫ్‌ వేస్తే అమెరికా కూడా పోటీ గా అంతా టారిఫ్‌ వేస్తుందని తేల్చి చెప్పారు.అయితే ఈ విధానం వల్ల మనదేశమే ఎక్కువ నష్టపోతుంది. అదెలాగంటే.. అమెరికా విధించిన టారిఫ్ ల కన్నా డబుల్ విధిస్తోంది మన దేశం. మోడీతో భేటీకి ముందే ట్రంప్ టారిఫ్‌ రేట్లను పెంచుతూ ప్రకటన చేసేశారు. అంటే మొహమాటం అస్సలు ఉండబోదని పరోక్షంగా తేల్చి చెప్పారు. ప్రపంచ దేశాలతో ఉన్న వాణిజ్య సంబంధాలను సమతుల్యం చేయడానికి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. టారిఫ్‌ ల అంశం పైనే భారత్ ప్రధానంగా ట్రంప్ ను దారికి తేవాలని ప్రయత్నించింది కానీ అది సాధ్య పడలేదు.అమెరికా ఉత్పత్తులపై ఇతర దేశాలు కూడా చాలా ఎక్కువ టారిఫ్‌ లు విధించాయి. అమెరికా ఓపెన్ మార్కెట్‌ విధానానికి ఇది వ్యతిరేకం. భారత ఉత్పత్తులపై అమెరికా విధించే టారిఫ్ లకన్నా మనదేశం అమెరికా గూడ్స్ పై విధించే టారిఫ్‌ 10 శాతం కన్నా ఎక్కువే.

మా వాణిజ్యం, ఉద్యోగావకాశాల మెరుగు.. :

పరస్పర టారిఫ్‌ల విషయంపై ట్రంప్ మాట్లాడుతూ ఈ విధానం వల్ల అమెరికా వాణిజ్య విధానం మెరుగుపడుతుందని,ఇతర దేశాలు తమ దేశంలో ఫ్యాక్టరీలు పెట్టుకోవచ్చని,ప్లాంట్‌లు ఏర్పాటు చేసుకోవచ్చనీ అన్నారు.
మెడికల్‌, కార్ల తయారీ, చిప్ ల తయారీ, సెమీ కండక్టర్ల తయారీ ఇలా అన్నిరకాల పరిశ్రమలు ఇక్కడ పెట్టుకుంటే టారిఫ్‌ ల బెడద ఉండదు.. మా దేశంలో ఉద్యోగావకాశాలు పెరుగుతాయి అని ట్రంప్ అన్నారు.

నష్టం మనకే.. :

పరస్పర టారిఫ్‌ల విధింపు వల్ల నష్టపోయేది మాత్రం మన దేశమే. కారణం అమెరికా మనదేశానికి చేసే ఎగుమతులకు మనం సగటున 9.5 శాతం టారిఫ్‌ విధిస్తున్నాం..అదే మన ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్నది మూడు శాతమే.
ఇరు దేశాధినేతల భేటీకి ముందు భారత్ తో బిజినెస్ చేయాలంటే చాలా కష్టమని ట్రంప్ అన్నారు.ఇప్పుడు ఈ పరస్పర టారిఫ్‌ ల విధింపు విధానం చాలా సులభంగా ఉంటుంది..కాబట్టి టారిఫ్‌ చార్జీలు మరీ తక్కువనో లేదా మరీ ఎక్కువనో మేం బాధపడే పనిలేదు అని ట్రంప్ అన్నారు.

ట్రంప్ విధించిన పరస్పర టారిఫ్‌ ల వల్ల దెబ్బ మనకే ఎక్కువ … కారణం అమెరికాకు మనం ఎగుమతి చేసే ఆహార ఉత్పత్తులు, కాయగూరలు, టెక్సటైల్స్,వస్త్ర పరిశ్రమ రంగాలపై ఇది తీవ్ర ప్రభావం పడుతుంది.అలాగే ఎలక్ట్రికల్‌ మెషినరీ, జెమ్స్, నగలు, ఫార్మా ఉత్పత్తులు, ఆటో,ఇనుము, ఇనుము, స్టీలు రంగాలకు చెందిన ముడిసరుకును మనదేశం అమెరికాకు ఎగుమతి చేస్తుంది.వీటిపైనా ఎగుమతి భారం పడుతుంది.ఈ విధానం వల్ల మన వాణిజ్యమే దెబ్బ తినే అవకాశాలున్నాయి.

భారత్‌ సర్దుబాటు చర్యలు :

తాజా పరిణామాల నేపధ్యంలో భారత్ తన వాణిజ్య విధానంలో చిన్న మార్పులు చేస్తోంది. 30 ఉత్పత్తులపై టారిఫ్‌ లు తగ్గించి ఆ సొమ్మును అమెరికా నుంచి రక్షణ, ఇంధన రంగాల పరికరాల దిగుమతులకు వెచ్చించాలని ఆలోచిస్తోంది. ఇది వాణిజ్య సంబంధమైన ఒత్తిళ్లను స్వల్పంగా తగ్గించినా, అమెరికాతో వాణిజ్య బంధం ముందు ముందు కష్టంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. టారిఫ్ ల వల్ల వినియోగ దారులపై ధరల భారం పడటమే కాదు వాణిజ్య రంగంలో పోటీ కూడా తగ్గిపోతుంది. ఇది అమెరికాకు, దాని వాణిజ్య భాగస్వాములకు లాభం కలిగించే అంశమే.. కానీ మనలాంటి వర్దమాన దేశాలకు కచ్చితంగా నష్టమే..

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com