చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారీ గిఫ్ట్ ఇచ్చారు. నేత కార్మికులకు లక్ష రూపాయల వరకు రుణాలు మాఫీ చేస్తున్నారు. ఈమేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
గత యేడాది అన్నదాతలకు రెండు లక్షల రూపాయల దాకా రుణాలు మాఫీ చేస్తూ.. భారీ ఉపశమనం కలిగించిన ప్రభుత్వం.. ఇప్పుడు చేనేత కార్మికులకు కూడా శుభవార్త వినిపించారు. నేతన్నల రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో, అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు రుణ మాఫీ చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు చేనేత కార్మికులకు రుణాలు మాఫీ చేస్తూ.. జీవో విడుదల అయ్యింది. సర్కారు విడుదల చేసిన జీవో మేరకు 2017 ఏప్రిల్ 1 వ తేదీ నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు రుణాలు తీసుకున్న చేనేత కార్మికులందరికి ఈ రుణమాఫీ వర్తించనుంది. ఈ జీవో ప్రరకారం మొత్తం చేనేత కార్మికులకు రూ.33 కోట్లు రుణాలు మాఫీ అయ్యాయని అధికారులు లెక్క గట్టారు. ఈ మేరకు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.