ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్‌ను ఓ మంచి విజయంతో ఆరంభించింది టీమ్ ఇండియా. ఇప్పుడు దాయాది దేశం పాకిస్థాన్‌తో ఆడేందుకు సమాయత్తమవుతోంది. ఇదే సమయంలో మరో చర్చ నడుస్తోంది. అదేంటంటే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత గంభీర్‌కు ఓ అగ్ని పరీక్ష ఉండబోతుందని. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత దిగ్గజ ఆటగాళ్లు అయితే రిటైర్‌మెంట్ అయినా ప్రకటిస్తారు.. లేదంటే వారిని పక్కన పెట్టేందుకు గంభీర్ సిద్ధంగా ఉండాలన్న చర్చ నడుస్తోంది. అందుకే గంభీర్ కోసం కఠిన సవాళ్లు ఎదురు చూస్తున్నాయని తెలుస్తోంది.
రోహిత్, విరాట్, జడేజా, షమీ.. ప్రస్తుతం వీరంతా టీమిండియాలో మోస్ట్ సీనియర్ ప్లేయర్స్. వీరు ఒక్కసారి టీమ్‌ను వీడితే వీరి ప్లేస్‌ను భర్తీ చేసే వారి విషయంలో గంభీర్ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. టీమిండియాలో ఇప్పటికి కూడా ఎవరి తర్వాత ఎవరిని ఆడించాలనే విషయంలో ఓ క్లారిటీ లేదు. బంగ్లాదేశ్ మ్యాచ్‌లో కూడా శ్రేయస్ ఔట్ కాగానే అక్షర్ క్రీజులోకి వచ్చాడు. అర్షదీప్, పంత్‌ను పక్కన పెట్టేసి.. రాహుల్, హర్షిత్‌ను ఆడించారు. అర్షదీప్‌ను పక్కన పెట్టడంపై అయితే పెద్ద చర్చే జరుగుతోంది. అందుకే గంభీర్ ఇప్పుడు ఆచితూచి అడుగులు వేయాలంటున్నాడు మాజీ ప్లేయర్ అనిల్ కుంబ్లే.
ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత 2027 వరల్డ్ కప్‌కు సిద్ధం కావాల్సి ఉంటుంది. దాని కోసం ఇప్పటి నుంచే సిద్ధం కావాల్సి ఉంటుంది. ఓ పటిష్టమైన టీమ్‌ను రెడీ చేసుకోవాలి. ఏదో అడపా దడపా ఆడించి పక్కన పెట్టడం కాకుండా.. ఒక్కొక్కరికి కనీసం 20 మ్యాచ్‌లు ఆడేందుకు అవకాశం కల్పించాలి.. ఇదీఇ కుంబ్లే చెబుతున్న విషయం. యంగ్ ప్లేయర్స్‌కు చాన్స్‌లు ఇచ్చే విషయంలో కోచ్, మేనేజ్‌మెంట్ మెరుగైన నిర్ణయాలు తీసుకోవాలని చెబుతున్నాడు కుంబ్లే.
నిజానికి ఛాంపియన్స్ ట్రోఫీలో టీమ్ పర్ఫామెన్స్‌ను బట్టే గంభీర్ ను కొనసాగిస్తారా? లేదా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం టీమ్ అయితే పటిష్టంగానే కనిపిస్తోంది. ప్లేయర్స్ తమ ఫామ్‌ను కొనసాగిస్తే.. గంభీర్ కోచ్ పదవికి ఎలాంటి ఎసరు ఉండదనే అనిపిస్తోంది. కానీ ఏవైనా పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే మాత్రం గంభీర్ మూల్యం చెల్లించక తప్పదనే చెప్పాలి.