33.1 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

రజతోత్సవ ఏర్పాట్లకు ముఖం చాటేస్తున్న నేతలు?

  • సభ నిర్ణయం నుంచి అన్నీ చిక్కులే…

  • ఇప్పటివరకు అటుచూడని హరీష్‌రావు

  • ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలూ సైలెంట్‌

  • ప్రచారంలో వెనకబడిన నేతలు

  • అందరూ ఏకతాటిపైకి వస్తారా?

తెలంగాణ రాజకీయాల్లో గులాబీ పార్టీగా ప్రసిద్ధి చెందిన భారత్ రాష్ట్ర సమితి 25వ వార్షికోత్సవానికి రంగం సిద్ధం చేస్తోంది. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితిగా పుట్టిన ఈ పార్టీ, ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా పరిణమించి 24 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ నెల 27న జరిగే రజతోత్సవ సభను వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో భారీగా నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ సభకు 10 లక్షల మందిని సమీకరించాలనే లక్ష్యంతో ఏర్పాట్లు కొనసాగుతున్నా, అంతర్గతంగా మాత్రం అనేక ఆటుపోట్లు వెలుగులోకి వస్తున్నాయి.

ముఖం చాటేస్తున్న నేతలు? :

ఈ సభ బాధ్యతలను మాజీ మంత్రి హరీశ్ రావుకు అప్పగించినప్పటికీ, ఆయన ఇప్పటివరకు ఎల్కతుర్తి ప్రాంతానికే రాక పోవడంపై పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. గతంలో సభల ఏర్పాట్లలో చురుగ్గా పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఈసారి ఈ సభ ఏర్పాట్లు, పర్యవేక్షణ విషయంలో దూరం దూరంగా ఉంటున్నారట. ఈ పరిణామం పార్టీలో గుసగుసలకు కారణమవుతోంది.

అనుమతి కోసం కోర్టు మెట్లు ఎక్కిన బీఆర్‌ఎస్‌

ఎల్కతుర్తిలో సభ నిర్వహణ కోసం అనుమతులు తీసుకోవడంలో పార్టీ నాయకులకు మొదట్లోనే అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి హైకోర్టును ఆశ్రయించగా, వరంగల్ కమిషనరేట్ అనుమతిని మంజూరు చేసింది. ఈ పరిణామం కేసీఆర్‌ ఆగ్రహానికి దారితీసింది. నాయకుల నిర్లక్ష్యం వల్లే అనుమతి విషయంలో అడ్డంకులు ఎదురయ్యాయని కేసీఆర్‌ ఫైర్ అయినట్లు సమాచారం.

ప్రచారంలో వెనుకంజ :

ఓరుగల్లు ప్రాంతంలో రజతోత్సవ సభకు తగిన స్థాయిలో ప్రాచుర్యం దక్కకపోవడంపై కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఓరుగల్లు నాయకులు అంత యాక్టివ్‌గా ఉండటం లేదని భావిస్తున్న కేసీఆర్‌.. ఇప్పటికే బాధ్యతల పునర్వినియోగం చేపట్టారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిలకు నియోజకవర్గాల వారీగా స్పష్టమైన టార్గెట్లు కేటాయించారు.

కేసీఆర్ స్వయంగా పర్యవేక్షణ :

సభ ఏర్పాట్లలో నిర్లక్ష్యం బయటపడటంతో కేసీఆర్ ఇక స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీకి రాష్ట్రంలో ఇంకా బలమైన ఆదరణ ఉన్నదని నిరూపించాలన్న లక్ష్యంతో ఆయన ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

నేతలంతా ఏకతాటిపైకి వస్తారా? :

రజతోత్సవ సభ విజయవంతం కావాలంటే పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో ముందుకు రావాల్సిందే. అంతిమంగా, కేసీఆర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేక పార్టీ అంతర్గత విభేదాల దెబ్బతో ఇబ్బందులు ఎదురవుతాయా అనే ప్రశ్నలే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com