29.2 C
Hyderabad
Thursday, September 17, 2026

Live Video

spot_img

కుంభమేళా ప్రపంచ రికార్డు

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభ మేళాకు తరలివస్తోన్న భక్త జనసందోహం చీమలదండులా కనిపిస్తోంది. మహాకుంభ మేళా మొదటి రెండు రోజుల్లో 5.15 కోట్ల మంది స్నానాలు చేశారు. తొలిరోజు మహాకుంభంలో 1.65 కోట్ల మంది స్నానాలు చేయగా, మకరసంక్రాంతి రోజున 3.50 కోట్ల మంది స్నానాలు చేశారు. దీంతో మహాకుంభమేళా ప్రపంచ రికార్డులు అధిగమించిందని వార్తలు వస్తున్నాయి.

హింస జరగలేదు! కులం, మతాల ప్రస్తావన లేదు! పౌరసత్వం గురించి ఎవరినీ అడగలేదు. ఎవరినీ కించ పరచలేదు! మరే ఇతర మతాన్ని చిన్నచూపు చూడలేదు. మేళాకు వచ్చిన భక్తులు ఆద్యాత్మికతలో తరించారు.

ప్రపంచం నలుమూలల నుంచి పేద, ధనవంతులు తేడాలేకుండా అన్ని వర్గాల భక్తులు వచ్చి హైందవ ఆచారాలకు అనుగుణంగా పూజలు ఆచరించి ఆనందించారు. కోట్ల మందికి ఆహారం, నీళ్లు తదితర మౌళిక వసతుల ఏర్పాటు కత్తిమీద సాము కాగా యుపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వసతి సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రయాగ్‌ రాజ్‌లో నివాస వసతి కూడా ఉంది. కొన్ని లక్షల మందికి ఈ సదుపాయాలు పూర్తిగా ఉచితం.

ప్రపంచంలోనే అత్యంత అరుదైన ప్రయాగ్‌ రాజ్ మహాకుంభ మేళా అతీంద్రియమైనది, ఊహకందనిదని మఠాధిపతులు చెపుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com