24.9 C
Hyderabad
Thursday, July 30, 2026

Live Video

spot_img

జనసేన నేత కిరణ్‌ రాయల్‌పై మహిళ సంచలన ఆరోపణలు

తిరుపతి జనసేన ఇంచార్జ్‌ కిరణ్‌ రాయల్‌ పై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. తనను నమ్మించి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాను చనిపోతున్నానని, తన చావుకు కిరణ్‌ రాయలే కారణమని, అతను తనకు చెల్లించాల్సిన డబ్బులను తన పిల్లలకు ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ మహిళ ఓ సెల్ఫీ వీడియో రిలీజ్‌ చేసింది.

తనను కిరణ్‌రాయల్‌ బ్లాక్‌మెయిల్‌ చేశాడని ఆ మహిళ ఆరోపించింది. తన పిల్లలను చంపుతానని బెదిరించి అన్ని రకాలుగా వాడుకోవడమే కాకుండా.. కోటి 20 లక్షల రూపాయల డబ్బులు తీసుకొని ఇప్పుడు మొహం చాటేశాడని చెప్పింది. తన దగ్గర అంత స్తోమత లేకున్నా అప్పులు తెచ్చి మరీ కిరణ్‌ రాయల్‌కు డబ్బులు ఇచ్చానని, తన దగ్గర కిరణ్‌ రాయల్‌ అరాచకాలకు సంబంధించిన ఆధారాలన్నీ ఉన్నాయని ఆ మహిళ సెల్ఫీ వీడియోలో వివరించింది. తాను చాలా కష్టాల్లో ఉన్నానని, తనకు అప్పులు ఎ క్కువయ్యాయని, పిల్లలకు సమాధానం చెప్పలేక పోతున్నానని ఆ మహిళ చెప్పింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన చావుకు కిరణ్‌ రాయలే కారణమని ఆ మహిళ స్పష్టం చేసింది. కేవలం కిరణ్‌ రాయల్‌ వల్లే చనిపోతున్నానని ఆ వీడియోలో తెలిపింది.

ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. జనసేన నాయకుడినని చెప్పుకుంటూ కిరణ్‌ రాయల్‌ ఇలాంటి అరాచకాలకు పాల్పడ్డాడా? అన్న చర్చ మొదలయ్యింది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com