కొద్ది రోజులుగా సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన అల్లు అర్జున్ కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) నోటీసులు జారీ చేసింది. సంధ్యా థియేటర్ దగ్గర లాఠీ ఛార్చ్ చేసిన పోలీసుల పాత్రపై సమగ్ర నివేది ఇవ్వాలని మానవ హక్కుల కమిషన్ నోటీసుల్లో పేర్కొంది.
లాయర్ రామారావు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపి నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని డీజీపీ జితేందర్ కు ఆదేశాలు జారీ అయ్యాయి. తాజాగా మానవ హక్కుల కమిషన్ జోక్యం చేసుకోవడంతో ఈ కేసు మరింత క్లిష్టతరంగా మారుతోందని విశ్లేషణ జరుగుతోంది. ఈ నోటీసులపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.
సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు నిందితుడిగా ఛార్జ్ షీట్ లో చేర్చారు. ఈ నేపథ్యంలో బన్నీని పోలీసులు రెండుసార్లు విచారించారు. అల్లు అర్జున్ పై ఇప్పటికే ఢిల్లీలో కూడా కేసు నమోదు అయ్యింది.