24.7 C
Hyderabad
Friday, April 24, 2026

Live Video

spot_img

రజతోత్సవ వేడుకల ఏర్పాట్లపై కేసీఆర్‌ సమీక్ష

భారత రాష్ట్ర సమితి పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లపై పార్టీ అధినేత కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులతో ఎర్రవెల్లిలో కేసీఆర్‌ సమావేశం నిర్వహించారు. గురువారం ఉదయమే ఎర్రవెల్లి చేరుకున్న నేతలతో కేసీఆర్‌ భేటీ అయ్యారు.

ఈ నెల 27వ తేదీన వరంగల్‌లో జరగనున్న బహిరంగ సభ , పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ అంశంపై సమావేశంలో చర్చించారు . పలు అంశాలపై బి.ఆర్.ఎస్ అధినేత కేసీఆర్ రెండు జిల్లాల ముఖ్య నాయకులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్ కుమార్, జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ మంత్రి , ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యేలు డా .కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి , అనిల్ జాదవ్ , కోవా లక్ష్మి, ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు, తోట ఆగయ్య, జోగు రామన్న, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com