36.2 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

పార్టీలో కీలక హోదా కోసం కవిత పట్టు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రస్తుతం ఓ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆయన కుమార్తె కవిత పార్టీలో కీలక మైన పదవి కావాలని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారట. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు అయ్యి జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత, తన రాజకీయ ప్రస్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో కవిత అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ, పార్టీలో ముఖ్యమైన పదవి లేకపోవడంతో, తాను చేపడుతున్న కార్యక్రమాలకు అంతగా ప్రాధాన్యత ఉండటం లేదని కవిత తండ్రితో వాదిస్తున్నారట.

బీఆర్‌ఎస్‌ పార్టీకి అంతర్గతంగా కాకుండా.. తెలంగాణ జాగృతి పేరుతో కవిత ప్రత్యేక ఆర్గనైజేషన్‌ను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, ట్రెండింగ్‌ నేపథ్యంలో బీసీలకు అండగా ఉంటామంటూ.. బీసీలకు న్యాయం జరగాలంటూ.. ‘జ్యోతిరావు పూలే ఫ్రంట్’ పేరిట డిస్కషన్లు, సమావేశాలు నిర్వహిస్తూ, తన ప్రభావాన్ని పెంచుకునే పనిలో కవిత ఉన్నారు. మరోవైపు.. పార్టీ ముఖ్యమైన సమావేశాల్లోనూ కవిత యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. అయితే, కేవలం తెలంగాణ జాగృతి బ్యానర్‌తో కాకుండా, ప్రత్యక్షంగా పార్టీకి సంబంధించిన కీలక స్థాయి పదవి కావాలని కవిత కోరుతున్నారట.

ప్రస్తుతం కవిత ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ.. ఆ హోదాతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మధ్యకు వెళ్లడానికి, రాష్ట్రస్థాయి కార్యక్రమాలు నిర్వహించడానికి, పార్టీ క్యాడర్‌ను నియంత్రించడానికి అంతగా వెసులుబాటు ఉండదన్న ఆలోచనతోనే.. కవిత రాష్ట్రస్థాయిలో పార్టీలో కీలక పదవి కావాలని ఇంట్లో పోరు పెడుతున్నారట. ముఖ్యంగా పార్టీ వైస్ ప్రెసిడెంట్ గానీ, సెక్రటరీ జనరల్ గానీ కొత్తగా క్రియేట్ చేసి ఆ పదవిలో నియమించాలని ఆమె తండ్రి కేసీఆర్‌ను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో, కేసీఆర్‌ సన్నిహితుల్లో చర్చ జరుగుతోంది.

ఇప్పటికే కుటుంబ పార్టీ అనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్న సమయంలో.. కవితకు పార్టీలో ముఖ్యమైన పెద్ద పదవి ఇస్తే సమస్యలు మరింత ముదిరే అవకాశం ఉందని కేసీఆర్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కీలకమైన పార్టీ అధ్యక్షుడిగా ఆయన, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కుమారుడు కేటీఆర్ ఉన్న నేపథ్యంలో, కవితను మరో కీలక స్థానంలోకి తీసుకు వస్తే.. కుటుంబ పార్టీ అనే విమర్శలు ఇప్పుడు మరింత ఎక్కువవుతాయని, అది పార్టీకి నష్టం కలిగించే ప్రమాదం ఉండొచ్చని కేసీఆర్‌ భావిస్తున్నారట.

మరోవైపు, పార్టీ స్థాపించినప్పటి నుంచీ.. బీఆర్ఎస్‌కు అంకితమై పనిచేస్తున్న హరీష్ రావుకు ఇప్పటివరకు సరైన హోదా ఇవ్వకపోగా, కవిత కోసం కొత్తగా పదవి సృష్టించడం అంటే.. హరీష్‌రావులో అసంతృప్తిని రెచ్చగొట్టే ప్రమాదం ఉందని కూడా కేసీఆర్‌ ఆలోచిస్తున్నారట. కూతురు కోసం ముఖ్య పదవి కేటాయించడంలో ఆలస్యానికి ఇది కూడా ఒక కారణమని అంటున్నారు.

కానీ, ఇన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కవిత మాత్రం వెనక్కి తగ్గడం లేదట. కీలక పదవి ఇచ్చి నాకు సపోర్ట్‌ చెయ్యాలంటూ.. రోజూ కేసీఆర్‌కు కవిత గుర్తు చేస్తుందని సన్నిహితులు చెబుతున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com