తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన ప్రీతి ముకుందన్ శ్రీవిష్ణు నటించిన ఓం భీమ్ బుష్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఇప్పుడు కన్నప్ప సినిమాతో మరోసారి తెలుగు ఆడియెన్స్ ను పలకరించేందుకు సిద్దమైన ప్రీతి కన్నప్ప పోస్టర్ షేర్ చేసింది.
వంద కోట్ల బడ్జెట్‌తో వస్తున్న కన్నప్ప సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తూ.. సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు కథానాయకుడు కాగా ప్రీతి ముఖుందన్ హీరోయిన్ గా అలరించబోతోంది.
ప్రభాస్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర తారలు ఈ చిత్రంలో నటిస్తున్నారు. మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
చిత్రబృందం తాజాగా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న ప్రీతి ముకుందన్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఈ సినిమాలో కన్నప్ప ఇష్టసఖి, చెంచుల యువరాణి నెమలి పాత్రలో ప్రీతి పాత్ర ప్రత్యేక ఆకర్షణ కానుంది.
ప్రీతి నటనకు తోడు భరతనాట్య నృత్యకారిణి, చిన్న వయస్సు నుండి శిక్షణ పొందింది. ప్రీతి ముకుందన్ మొదటి మ్యూజిక్ ఆల్బమ్ ‘ముత్తు ము2’తో యూట్యూబ్ లో 4.2 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి పేరొందినది.
”అందంలో సహజం.. తెగింపులో సాహసం.. ప్రేమలో అసాధారణం.. భక్తిలో పారవశ్వం.. కన్నప్పకి సర్వస్వం చెంచుల యువరాణి నెమలి అంటూ” ప్రీతి ముకుందన్ ఫస్ట్‌లుక్‌ను పంచుకుంది.
పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ప్రతి సోమవారం సినిమాకు సంబంధించిన విశేషాలు అందిస్తున్న నిర్మాతలు…తాజాగా ప్రీతి ముఖుందన్ నెమలి పోస్టర్ విడుదల చేశారు.