యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ అవెయిటింగ్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. కేజీఎఫ్, సలార్ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వస్తున్న మూవీ వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ అవుతుందని ప్రకటించారు. ఈ మూవీకి ఇంకా టైటిల్ కన్ఫామ్ చేయలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్31గా ఈ ప్రాజెక్ట్ రాబోతుంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ నెల 22 నుంచి తారక్ కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు సమాచారం. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ ప్రస్తుతం ప్రచారంలో ఉంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా రానున్న ఈ మూవీపై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయనే చెప్పాలి. దేవరతో హిట్ కొట్టారు ఎన్టీఆర్. కేజీఎఫ్ 1,2, సలార్ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‍లో ప్రశాం క్రేజ్ మాములుగా లేదు. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సినిమా ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఎన్టీఆర్ బర్త్‌డే రోజు ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ అభిమానుల ముందుకు రాబోతుంది. దీన్ని బట్టి మే 20న గ్లింప్స్ రానుందని అర్థమైపోయింది. గ్లింప్స్ రిలీజ్ సమయంలోనే టైటిల్ కూడా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. మరి అది డ్రాగన్‌గానే ఉంటుందా? లేక మరేదైనా టైటిల్ ఉంటుందా? అనేది చూడాలి. ప్రస్తుతానికైతే ఈ మూవీ షూటింగ్ కర్ణాటకలో శరవేగంగా జరుగుతోంది.