37.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

రష్యాకు జిన్‌పింగ్.. యూఎస్‌కు మాస్ట్రర్ స్ట్రోక్!

ఓ వైపు అమెరికాకు నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసే సమయం.. మరోవైపు ఉక్రెయిన్-రష్యా మధ్య భీకర యుద్ధం ఇలాంటి సమయంలో రష్యాలో పర్యటించేందుకు రెడీ అయ్యారు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్. ఇవేవో ఊహాగానాలు కాదు.. ఈ విషయాన్ని బీజింగ్‌లోని రష్యా రాయబారి ఇగోర్ మోర్గులోవ్ అధికారికంగా ప్రకటించారు. నిజానికి రష్యాతో దోస్తీకి ఇప్పుడు ప్రపంచ దేశాలు కాస్త జంకుతున్నాయి. కానీ భారత్, చైనా మాత్రం బహిరంగంగానే స్నేహ హస్తం చాస్తున్నాయి. ఆంక్షల బెదిరింపులను పక్కన పెట్టి వాణిజ్యం కూడా చేస్తున్నాయి. భారత్‌ అయినా కాస్త ఆలోచనతో అడుగులు వేస్తోంది కానీ.. చైనా మాత్రం ఓపేన్‌గా అమెరికాకు వ్యతిరేకంగా.. రష్యాకు అనుకూలంగా అడుగులు వేస్తోంది.

అయితే ఈ పర్యటనను ఖరారు చేసిన రష్యా రాయబారి మరికొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఉక్రెయిన్‌ యుద్ధ విషయంలో రష్యా ఆలోచనలను చైనా అర్థం చేసుకుంది. అంతేకాదు చాలా విషయాల్లో రష్యా, చైనాను పశ్చిమ దేశాలు టార్గెట్ చేస్తున్నాయి. వీటిపై మరింత స్పందించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు ఆయన.

మొత్తానికి కొత్త ఏడాదిలో చైనా అధ్యక్షుడు రష్యాలో అడుగుపెట్టనున్నారు. అయితే తేదీలు మాత్రం ఖరారు కానట్టు తెలుస్తోంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవానికి చైనా అధ్యక్షుడిని ఆహ్వానించారు. కానీ దానిని ఆయన తిరస్కరించినట్టు తెలుస్తోంది. అయితే అమెరికాకు కాదని.. జిన్‌పింగ్ రష్యాకు వెళ్లడం మరో హాటిక్.

రష్యా కూడా అమెరికా కారణంగా చైనాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పుతిన్ తన తొలి విదేశీ పర్యటనను చైనాలోనే చేశారు. అంతకుముందు జిన్‌పింగ్‌ కూడా రష్యాలో పర్యటించారు. ప్రస్తుతం తైవాన్ విషయంలో కూడా చైనా దుందుడుకుగా ముందుకు వెళ్తోంది. మరి ఈ సమయంలో జిన్‌పింగ్ పర్యటన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com