31.8 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

జయహో రామానుజ సినిమా సాంగ్స్ రిలీజ్

లయన్ డా. సాయి వెంకట్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా “జయహో రామానుజ”. ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ లో సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మిస్తున్నారు. అమెరికా నటి జో శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా..సుమన్, ప్రవళ్లిక ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, సంస్కృత భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర సాంగ్స్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.

దర్శకుడు, హీరో డా.లయన్ సాయి వెంకట్ మాట్లాడుతూ – మన తెలుగు రాష్ట్రాల్లో రామానుజాచార్యుల గురించి పెద్దగా తెలియదు. తమిళనాట ప్రతి ఒక్కరికీ ఆయన ఎవరో తెలుసు. చినజీయర్ స్వామి సమతామూర్తి విగ్రహాన్ని మన దగ్గర ప్రధాని, రాష్ట్రపతి వంటి పెద్ద వాళ్లు వచ్చి ఆవిష్కరించినప్పుడు తెలుగు రాష్ట్రాల వారికి బాగా ఆయన గురించి తెలిసింది. తెలుగు ప్రజలకు రామానుజాచార్యుల వారి గొప్పదనం తెలియజేసే ప్రయత్నంలోనే ఈ చిత్రాన్ని రూపొందించాను. వెంకటేశ్వర స్వామికే గురువు లాంటి వారు రామానుజులు. వెంకటేశ్వరుడికి శంఖు చక్రాలు రామానుజాచార్యుల వారే బహూకరించారని అన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com