32.5 C
Hyderabad
Wednesday, June 17, 2026

Live Video

spot_img

తెలుగు తల్లికి జల హారతి

  • గోదావరి, బనక చర్ల ప్రాజెక్టు పై చంద్రబాబు
  • నదుల అనుసంధానం తో ఏపీ భవిష్యత్తును మార్చేస్తాం

సముద్రంలోకి వ్రుధాగా పోతున్న 3వేల టీఎంసీల నీటిలో పది శాతం నీటిని తరలించుకోగలిగితే సుస్థిర ఆర్థిక పురోగతి సాధించి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ నిలబడుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. క్రిష్ణా,గోదావరి నీళ్లను పూర్తి స్థాయిలో సద్వినియోగంచేసుకుంటే రాష్ట్రంలో కావలసినంత విద్యుత్ ఉత్పత్తి చేసుకుని, రాయలసీమ జిల్లాలకు కూడా నీళ్లివ్వచ్చని చంద్రబాబు అన్నారు. ఈనదుల అనుసంధానంతో జల విప్లవమే సాధించవచ్చని అన్నారు. గోదావరి, బనక చర్ల ప్రాజెక్టుతో ఇది సాధ్యపడుతుందని,తెలుగు తల్లికి జలహారతి పట్టొచ్చని అన్నారు. గోదావరి, బనకచర్ల ప్రాజెక్టును సాకారం చేసుకుంటే నదుల అనుసంధానం అయినట్లేనని అన్నారు.
సోలార్ , విండ్ పవర్ పంప్డ్ ఎనర్జీని సరిగా వినియోగించుకుంటే గ్రీన్ ఎనర్జీని పూర్తి స్థాయిలో వినియోగం లోకి తేవచ్చని అన్నారు.తెలుగు రాష్ట్రాల్లో 90 శాతం ప్రాజెక్టులు తెలుగు దేశ ప్రభుత్వ హయాంలో కట్టినవేనని అన్నారు.ప్రతిపాదిత గోదావరి, బనక చర్ల ప్రాజెక్టు ఒక గేమ్ ఛేంజర్ కాగలదని ..దానిని సాకారం చేసుకుంటే భవిష్యత్తులో రాష్ర్టం, దశ దిశ మారిపోతాయంటున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కర్నూలు జిల్లాలోని బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ కు రోజూ రెండు టీఎంసీల నీటిని తరలిస్తామన్నారు. ఇది ప్రతిపాదన మాత్రమేనని దీనిపై సమగ్ర, పరిపూర్ణ చర్చ జరగాలని అన్నారు. మూడు దశల్లో బనకచర్ల ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు.పోలవరంనుంచి క్రిష్ణా నదికి నీరు తరలిస్తామని, రెండోదశలో బొల్లాపల్లి జలాశయం నిర్మిస్తామని,మూడోదశలో అక్కడ నుంచి బనక చర్లకు నీరు తరలిస్తామని అన్నారు. డబ్బుంటే మూడేళ్ల కాల వ్యవధిలో ఇది పూర్తవుతుందన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com