మెల్ బోర్న్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైశ్వాల్‌ది ఔటా? నాటౌటా? ఇప్పుడు దీనిపైనే దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అనవసరమైన రన్‌కు ప్రయత్నించి పెవిలియన్ చేరిన ఈ యంగ్ బ్యాట్స్‌మెన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియాను ఓటమి అంచు నుంచి బయటపడేస్తాడనుకున్న సమయంలో ఔట్ అయ్యాడు. అయితే థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
నిజానికి 340 పరుగుల టార్గెట్‌ను చేజ్ చేసేందుకు ఒక రోజంతా టైమ్ ఉంది టీమిండియా బ్యాట్స్‌మెన్ వద్ద. కానీ మెయిన్ ప్లేయర్సంతా వరుసగా వికెట్లు సమర్పించుకుంటూ వచ్చారు. కానీ ఓ ఎండ్‌లో జైశ్వాల్ ఒంటరిగా పోరాడుతూ వచ్చాడు. ప్రతి బాల్‌ను ఫేస్ చేస్తూ ఓపికగా పరుగులు రాబట్టాడు. 84 పరుగుల వరకు వచ్చాడు. 70 ఓవర్‌లో కమిన్స్ వేసిన ఐదో బాల్‌ను బ్యాక్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు జైశ్వాల్. అది మిస్ అయ్యింది. బాల్ నేరుగా వికెట్ కీపర్ చేతిలో పడింది. ఆసీస్ ప్లేయర్స్ అప్పిల్ చేశారు.. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ అన్నాci.. వెంటనే కమిన్స్ DRS తీసుకున్నాడు. ఇక్కడే అసలు పంచాయితీ అంతా మొదలైంది. బాల్ బ్యాట్‌కు టచ్ అయ్యిందా లేదా అనే దానిపై థర్డ్ ఎంపైర్ అనేక సార్లు టెస్ట్ చేశాడు. స్నికో మీటర్‌లో ఎలాంటి స్పైక్ కనిపించలేదు. కానీ థర్డ్ అంపైర్ మాత్రం ఔట్ ఇచ్చేశాడు.
ఆసీస్ ప్లేయర్స్ సెలబ్రేట్ చేసుకున్నారు.. జైశ్వాల్ షాక్‌లో ఉండిపోయాడు. అతను ఔట్ అవ్వకపోతే మ్యాచ్ గెలుస్తామా అనే క్వశ్చన్ రావొచ్చు. కానీ అతను ఉండి ఉంటే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలైనా ఉండేవి కదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా అతను ఔటైన విధానంపై మాత్రం ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. స్నికో మీటర్‌లో ఎలాంటి చేంజ్ లేకుండా ఔట్‌గా ఎలా ప్రయత్నిస్తారనే చర్చ నడుస్తోంది.
అయితే ఈ కాంట్రవర్సీకి చెక్ పెట్టే ప్రయత్నాలు మొదలైనట్టు కనిపిస్తోంది. షాట్ ఆడినప్పుడు ఎలాంటి సౌండ్ రాలేదని.. అందుకే స్పైక్ కనిపించలేదని.. కానీ హాట్ స్పాట్‌తో చెక్ చేశామనే వాదనను తెరపైకి తీసుకొస్తున్నారు. మరి అదే హాట్ స్పాట్ ప్రేక్షకులకు ఎందుకు చూపించలేదు? నిజంగా అలా చెక్ చేశారా? లేక తాము చేసినదాంట్లో తప్పేమి లేదని కవర్ చేసుకునే ప్రయత్నమా? చెక్ చేసిన విషయాన్ని లైవ్‌లో చూపిస్తే ఇంత గొడవ ఉండేది కాదు కదా అనేది ఇప్పుడు మరో చర్చకు కారణమైంది.