32.6 C
Hyderabad
Tuesday, June 16, 2026

Live Video

spot_img

ఇస్రో స్పడెక్స్‌ గ్రాండ్‌ సక్సెస్‌

స్పేస్‌ డాకింగ్‌ క్లబ్‌లో చేరిన భారత్‌

స్పేస్‌ డాకింగ్‌లో విజయం సాధించి భారతదేశాన్ని ఆగ్రదేశాల సరసన నిలబెట్టింది ఇస్రో. అంతరీక్షంలో ఉపగ్రహాల డాకింగ్‌ సమర్ధవంతంగా చేయడం ద్వారా ఇస్రో చేపట్టిన చారిత్రాత్మకమైన స్పడెక్స్‌ మిషన్‌ని విజయవంతం చేసింది. భారత అంతరీక్ష పరిశోధనా సంస్ధ గురువారం అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను సక్సెస్‌ఫుల్‌గా డాకింగ్‌ చేసింది. స్పెస్‌ డాకింగ్‌ ప్రయోగంలో భాగమైన స్పడెక్స్‌ మిషన్‌ విజవంతంగా పూర్తి చెయ్యడంతో భారతదేశం ప్రపంచంలోనే స్పేస్‌ డాకింగ్‌ టెక్నాలజీ ఉన్న నాలుగొవ దేశంగా నిలుస్తుంది. ఈ విజయంతో భారతదేశం ఎలైట్‌ స్పేస్‌ డాకింగ్‌ క్లబ్‌లో చేరింది. స్పడెక్స్‌ మిషన్ని విజయవంతం చేసినట్లు గురువారం ఉదయం 10 గంటలకు ఇస్రో ప్రకటించింది. అంతరీక్ష పరిశోధనా రంగంలో భారతదేశానికి ఇది ఒక చారిత్రక క్షణమని ఇస్రో పేర్కొంది. ఎస్‌డీఎక్స్‌01 అంటే ఛేజర్‌ ఉపగ్రహం, ఎస్‌డీఎక్స్‌02 అంటే టార్గెట్‌ ఉపగ్రహం… ఈ రెండు ఉపగ్రహాలు సెకనుకు పది మిల్లీమీటర్ల వేగంతో ఖచ్చితమైన ప్రయాణ యుక్తిని ప్రదర్శించాయని ఇస్రో తెలిపింది. భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులో ఈ డాకింగ్‌ ప్రక్రియ జరిగింది. అంతరీక్ష డాకింగ్‌ సాధించిన నాలుగొవ దేశంగా ఇప్పుడు భారతదేశం నిలుస్తుంది. అంతకుముందు ఈ ఘనతను రష్యా, చైనా, అమెరికాలు సాధించాయి. పూర్తిగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన డాకింగ్‌ వ్యవస్ధ చంద్రయాన్‌ 4 వంటి భవిష్యత్‌ మిషన్లకు ఉపయోగకరం.

ప్రధాని మోడీ అభినందనలు…

ఇస్రో విజయంపైపప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా ఇస్రో శాస్త్రవేత్తలకు మోడీ అభినందనలు తెలిపారు. ట్విట్టర్‌లో నరేంద్ర మోడీ ‘ఉపగ్రహాల స్పేస్ డాకింగ్‌ను విజయవంతంగా ప్రదర్శించినందుకు ఇస్రోలోని మన శాస్త్రవేత్తలకు, అంతరిక్ష సోదరులకు అభినందనలు. రాబోయే రోజుల్లో భారత్‌ యొక్క ప్రతిష్టాత్మక అంతరిక్ష కార్యకలాపాలకు ఇది ఎంతో ముఖ్యమైనది. మీ అందరికీ అభినందనలు’ అంటూ కామెంట్స్‌ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com