ఓ వైపు స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి.. లక్షల కోట్ల సంపద ఆవిరైపోతుంది.. బిలియనీర్ల గంటల వ్యవధిలోనే బిలియన్ డాలర్లు కోల్పోతున్నారు.. మరో వైపు టారిఫ్‌ల పుణ్యమా బ్రతుకే ఓ నరకంగా మారనుందన్న భయాలు.. ఇలా వీటన్నింటికి కారణాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన పుణ్యమా అని అమెరికా.. దాని వెంట ప్రపంచ దేశాలు మాంద్యం ముప్పులోకి జారుతున్నాయన్న భయాలు కనిపిస్తున్నాయి. కానీ ట్రంప్ మాత్రం డోంట్ వర్రీ అంటున్నారు. అసలు మాంద్యం ముచ్చటే లేదని.. టెన్షన్ పడొద్దని చెబుతున్నారు.
చమురు ధరలు తగ్గుతుంటే మాంద్యం ఎక్కడి నుంచి వస్తుందంటున్నారు ట్రంప్. ఆయిల్ రేట్లు తగ్గుతున్నాయి.. ఇంట్రెస్ట్ రెట్లు తగ్గుతున్నాయి.. ఆహార ధరలు తగ్గుతున్నాయి.. అమెరికాలోకి బిలియన్ డాలర్ల సంపద వస్తుంది.. ఇన్ని జరుగుతుంటే మాంద్యం ఎక్కడిదని రివర్స్ అటాక్ చేస్తున్నారు ట్రంప్.
ఇదే టైమ్‌లో మరోసారి చైనాపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ట్రంప్. అమెరికాపై చైనా 34 శాతం టారిఫ్‌లు విధించడం అనేది ఓ పిచ్చి చర్య అన్నారు ట్రంప్. చైనా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఉన్నా.. టారిఫ్‌లను పెంచుతుందంటూ మండిపడ్డారు. దశాబ్ధాలుగా అమెరికాను దోచుకున్నారని.. దీనికి కారణం గత పాలకులే అంటూ మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌పై పరోక్షంగా ఫైర్ అయ్యారు. మళ్లీ అమెరికాను గ్రేట్‌గా మారుస్తానంటూ అనౌన్స్ చేశారు.
అమెరికాలో వడ్డీ రేట్లను తగ్గించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ట్రంప్. కానీ వర్షన్ మాత్రం మరోలా ఉంది. టారిఫ్‌ల పుణ్యమా అని ఇప్పుడు మాంద్యం ముంచుకొచ్చే ప్రమాదం ఉందని.. దీని వల్ల నిరుద్యోగం పెరుగుతుందని.. వృద్ధిని కూడా నెమ్మదిగా చేస్తుందంటున్నారు నిపుణులు.