24.3 C
Hyderabad
Saturday, October 31, 2026

Live Video

spot_img

అదే నేనుంటేనా…!?

కమలా హారిస్ పోటీ చేసింది కాబట్టి సరిపోయింది.. అదే నేనుంటేనా.. ట్రంప్‌ గెలవడం కాదు కదా.. అసలు ఎందుకు పోటీ చేశానా? అనే లెవల్‌లో ఓడిపోయేవాడు అని చెప్పకనే చెబుతున్నారు మరికొన్ని రోజుల్లో పదవి నుంచి దిగిపోయే అధ్యక్షుడు జో బైడెన్. మీరు ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై ఏమైనా ఫీల్ అవుతున్నారా? మీరు పోటీ చేసి ఉంటే ట్రంప్ ఓడిపోయేవారా? అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించాడు బైడెన్‌ని. దీనికి ఆయన దిమ్మతిరిగిపోయే సమాధానం ఇచ్చారు.

నేను ఎన్నికల బరిలో దిగి ఉంటే ట్రంప్‌ను ఖచ్చితంగా ఓడించేవాడిని. అయితే డెమోక్రటిక్ పార్టీలో ఐక్యత కోసమే తాను పోటీ నుంచి తప్పుకున్నాను.. కమలా హారిస్ కూడా ట్రంప్‌ను ఓడిస్తారని నమ్మాను. అందుకే మద్దతు ఇచ్చాను కానీ అలా జరగలేదు. నిజానికి కమలా కూడా చాలా గట్టిగానే పోరాడారు… ఇదీ బైడెన్ ఇచ్చిన సమాధానం.

బైడెన్ ఇచ్చిన ఆన్సర్‌పై ఇప్పుడు చర్చ మొదలైంది. కమలా పోటీ చేస్తే పరిస్థితి ఇలా ఉంది. అదే బైడైన్ పోటీ చేసి ఉంటే డెమోక్రటిక్ పార్టీ పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యేదనే చర్చ నడుస్తోంది. నిజానికి బైడెన్‌ మొదట అధ్యక్ష బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యారు. ఆయన పార్టీ నేతలు కూడా మొదట ఆయనకే మద్దతిచ్చారు కూడా. కానీ ఎప్పుడైతే ట్రంప్, బైడెన్ మధ్య మొదటి డిబేట్ జరిగిందో అప్పుడు మారింది పరిస్థితి. ఒక్కసారిగా ట్రంప్‌కు మద్ధతు పెరిగింది. దీంతో డెమోక్రటిక్ పార్టీలో భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయి. ఆయన అధ్యక్ష బరి నుంచి తప్పుకోవాలన్న డిమాండ్లు వినిపించాయి. అయితే బైడెన్ మొదట మొండికేసినా.. ఆయన ఆరోగ్యం, పార్టీ పెద్దలు, మాజీ అధ్యక్షుల సూచనతో ఆయన కమలా పేరును రిఫర్ చేశారు. అయినా కానీ ఆ పార్టీకి ఓటమి తప్పలేదు. అందుకే తాను పోటీ చేసి ఉంటే బాగుండేదంటున్నారు బైడెన్.

నిజానికి బైడెన్ మొదటే అధ్యక్ష రేస్ నుంచి తప్పుకుంటే పరిస్థితి మరోలా ఉండేదన్న చర్చ కూడా నడుస్తోంది. మొదట్లో కమలా హారిస్‌కు భారీగానే మద్దతు దక్కినా.. ట్రంప్‌ మాత్రం దూసుకుపోయారు. తనదైన శైలిలో ప్రసంగాలు చేస్తూ అమెరికన్లను తనవైపుకు తిప్పుకున్నాడు. అమెరికాను మరోసారి అగ్రరాజ్యంగా నిలుపుతానంటూ ప్రతిజ్ఞ చేశారు. దీంతో ఆయనకే మద్దతు పలికారు ప్రజలు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com