38.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

జానారెడ్డి లేఖ అందుకోసమేనా…!

  • కాంగ్రెస్ పార్టీలో సంచలనగా మారిన జానా లేఖ
  • రంగారెడ్డి జిల్లాకు క్యాబినెట్‌ లో అవకాశం ఇవ్వాలని జానా డిమాండ్‌
  • అదే జరుగుతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం లేనట్టే

తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి చర్చ జరుగుతున్న సమయంలో సడన్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాయడం సంచలనంగా మారింది. నిజానికి చాలా కాలంగా జానారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయంగా ఇద్దరు కొడుకులు సెటిల్ కావడంతో ఆయన పెద్దగా రాజకీయాల గురించి పట్టించుకోవడం లేదు. నేను రాజకీయాల్లో యాక్టివ్‌ గా లేనని ఈ మధ్య ఓ సందర్భంలో ఆయనే స్వయంగా చెప్పుకున్నారు.

ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ మంత్రివర్గ విస్తరణ కోసం చాలామంది నేతలు ప్రయత్నిస్తున్న సమయంలో జానారెడ్డి అధిష్టానానికి ఒక లేఖ రాశారు. నిజానికి విస్తరణ విషయంలో కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్లు ఎవరు అధిష్టానానికి లేఖలు రాయలేదు. కొంతమంది ఎమ్మెల్యేలు తమకు అవకాశం ఇయ్యాలని లేఖలు రాశారు తప్ప.. సీనియర్లు ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు పూర్తిగా ఇది అధిష్టానం వ్యవహారమని ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విస్తరణ ఎప్పుడు జరగాలి ఏ విధంగా జరగాలన్నది పూర్తిగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని స్వయంగా ప్రకటించారు కూడా.

ఒకటి రెండు రోజుల్లో క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని ప్రచారం జరుగుతున్న ఈ తరుణంలో నల్గొండ జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అధిష్టానానికి ఒక లేఖ రాస్తూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కు చెందిన ఎమ్మెల్యేలకు క్యాబినెట్లో అవకాశం కల్పించాలని కోరారు. చూడడానికి ఇది సాధారణ లేఖగానే కనిపిస్తున్నా దీని వెనుక రాజకీయ కోణం వేరేలా ఉన్నట్టుగా తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో స్థానం కోసం ప్రయత్నిస్తున్న వారిలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముందున్నారు. తనకు అవకాశం ఇవ్వాలని ఆయన చాలా రోజుల నుంచి కోరుతున్నారు కూడా. మల్‌రెడ్డి రంగారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోకి వస్తుంది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌ పరిధిలో మల్‌రెడ్డి ఒక్కరే కాంగ్రెస్‌ తరపున విజయం సాధించారు.

అయితే జానారెడ్డి రాసిన లేఖలో మల్ రెడ్డి రంగారెడ్డి పేరు ప్రస్తావించకపోయినా రంగారెడ్డి జిల్లా నుంచి మాత్రం తప్పనిసరిగా ఒకరికి అవకాశం ఇవ్వడం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి అవసరమని తన లేఖలో ప్రస్తావించారు. ఈవిధంగా జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీ అంశంగా మారింది. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారికి ఇప్పటికే క్యాబినెట్లో ప్రాధాన్యత ఎక్కువగా ఉందనే విమర్శలు ఉన్నాయి. నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రివర్గంలో స్థానం గ్యారంటీ అని హోంమంత్రి ఇస్తే బాగుంటుందని కూడా ప్రచారం చేసుకుంటున్నారు. అధిష్టానం తనకు హామీ ఇచ్చినట్లుగా కూడా ఆయన ప్రకటించారు. నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు క్యాబినెట్ లో ఉన్నారు. అదే జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి క్యాబినెట్ల అవకాశం ఇస్తే ఒకే జిల్లా నుంచి ముగ్గురు రెడ్లు క్యాబినెట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా అవుతుంది. రంగారెడ్డి లాంటి పెద్ద జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లేకుండా చేయడం సరైంది కాదన్న అంశాన్ని జానారెడ్డి తెరపైకి తీసుకురావడం ద్వారా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెక్ పెడుతున్నారా అన్న అనుమానం వ్యక్తం అవుతుంది.

క్యాబినెట్లో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారి సంఖ్య పెరగడం మంచిది కాదని జానారెడ్డి అభిప్రాయ పడినట్టుగా తెలిసింది. మల్ రెడ్డి రంగారెడ్డికి అవకాశం ఇవ్వడం వల్ల ఇతర జిల్లా నుంచి అవకాశం ఇవ్వడం వల్ల రంగారెడ్డి లాంటి జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఇవ్వడంలో పాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ కి కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుంది. అయితే ఉమ్మడి రంగారెడ్డి, గ్రేటర్‌ పరిధి కలసి వచ్చేలా అక్కడి నుంచి ఎన్నికైన శాసనసభ్యుడ్ని క్యాబినేట్‌ లోకి తీసుకుంటే రానున్న కాలంలో అది పార్టీకి ప్లస్ అవుతుందని జానారెడ్డి అంటున్నారు. మంత్రివర్గ విస్తరణ పై అకస్మాత్తుగా జానారెడ్డి ఈ రకమైన లేఖ రాయడంతో రాజగోపాల్‌ రెడ్డి వర్గీయులు ఖంగుతిన్నారు. అధిష్టానానికి మంత్రివర్గ విస్తరణ గురించి లేఖ రాయడం ద్వారా తన సీనియార్టీతో జానారెడ్డి చాణక్య రాజకీయం చూపించారని కాంగ్రెస్‌ శ్రేణులు అంటున్నారు.  ఫలానా వాళ్లకు ఇవ్వాలని ఆయన లేఖలో రాయినప్పటికీ రంగారెడ్డి జిల్లా నుంచి మాత్రం కచ్చితంగా అవకాశం ఇవ్వాలన్నది ఆయన అభిప్రాయం. రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు రేస్ లో ఉన్నాను నేత మల్రెడ్డి రంగారెడ్డి.

క్యాబినెట్ విస్తరణలో అవకాశం కోసం ఎదురుచూస్తున్న రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సుదర్శన్ రెడ్డి సీనియర్ కావడం అదేవిధంగా ఆ జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ఆయనకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో కూడా అదే పరిస్థితి రంగారెడ్డికి అవకాశం ఇవ్వడం వల్ల అక్కడ ప్రాతినిధ్యం పెరుగుతుంది అన్నది కొందరి వాదన. నల్గొండ జిల్లాకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నారని అది కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కావడం చేత మరో రెడ్డికి అక్కడ అవసరం లేదని కొందరు సూత్రీకరిస్తున్నారు. మొత్తానికి జానారెడ్డి తన రాజకీయ చతురతను మరోసారి ప్రదర్శించినట్టుగా కనిపిస్తుంది. ఒకరికి ఇవ్వండి అని చెప్పడం ద్వారా మరొకరికి ఇవ్వద్దు అని ఆయన ఇండికేషన్స్ ఇచ్చారు. మరి అధిష్టానం దీనిపైన ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com