ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సైతం పోటీలో ఉన్నప్పటికీ ప్రధానపోటీ ఆప్, బీజేపీ మధ్యనే ఎక్కువగా పోటీ ఉంటుందనే ప్రచారం సాగిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మరింత ఆసక్తి రేపుతున్నాయి. 30 నుంచి 37 అసెంబ్లీ స్థానాలు ఆప్ గెలుచుకునే అవకాశం ఉందని కొన్ని సర్వే సంస్థలు చెప్పగా.. బీజేపీ 35 నుంచి 40 స్థానాల వరకు గెలుచుకోవచ్చని మరికొన్ని సర్వే సంస్థలు అంచనా వేశాయి. ప్రముఖ సర్వే సంస్థల అంచనాలు కింది విదంగా ఉన్నాయి.
ఆప్‌ను దెబ్బకొట్టేందుకు బీజేపీ రోజుకో ప్రచారఅస్త్రాన్ని బయటకు తీసుకురాగా.. వాటిని ధీటుగా తిప్పికొట్టడంతో పాటు బీజేపీపై తీవ్రస్థాయిలో ఆప్ విమర్శలు కురిపించింది. కాంగ్రెస్ సైతం పోటీలో ఉన్నప్పటికీ ప్రధానపోటీ ఆప్, బీజేపీ మధ్యనే ఉంటుందనే ప్రచారం సాగిననేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఢిల్లీ ఫలితాలపై మరింత ఆసక్తి రేపుతున్నాయి.
ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి రెండు పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేశాయి. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో రాజకీయ విమర్శలు చేసుకున్నారు. ఈక్రమంలో ఢిల్లీ ఓటర్లు ఎవరిని ఆశీర్వదించారనేది ఆసక్తిగా మారింది.