27.5 C
Hyderabad
Monday, September 14, 2026

Live Video

spot_img

అణ్వాయుధాలే దిక్కంటున్న ఇరాన్

అమెరికా విషయంలో తగ్గేదేలే అంటోంది ఇరాన్. ఒకవేళ అమెరికా లేదా దాని మిత్రదేశాలు ఇరాన్‌పై దాడులకు పాల్పడితే తమకు అణ్వాయుధాలు తప్ప వేరే ఆప్షన్ లేదంటూ సంచలన ప్రకటన వచ్చింది ఇరాన్ నుంచి. ఈ వ్యాఖ్యలు చేసింది మరేవరో కాదు.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ముఖ్య సలహాదారుడు అలీ లారిజానీ.

ఇరాన్‌కు అణ్వాయుధాలు తయారు చేయాలనే ఆలోచన లేదు… కానీ అమెరికా తీరు చూస్తుంటే తప్పేలా లేదు. తమ ఆత్మరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంంటున్నారు అలీ లారిజానీ. అమెరికా నేరుగా కానీ లేదా ఇజ్రాయెల్ ద్వారా కానీ దాడులు జరిపితే..ఇరాన్ ఓ కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు, ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల ఇప్పటికే ఇరాన్ తీవ్రంగా స్పందిస్తోంది. దాడులు చేస్తే అమెరికా ప్రతిదాడులు ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉన్నామని వార్నింగ్ ఇచ్చారు అయతుల్లా అలీ ఖమేనీ. ఇప్పటికే ఇరాన్ వ్యూహాత్మక ప్రాంతాల్లో అత్యాధునిక క్షిపణులను మోహరించిందని.. ఏదైనా జరిగితే వాటిని ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంచినట్టు నిఘా సంస్థలు గుర్తించినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఇటు అమెరికా, అటు ఇరాన్ సై అంటే సై అంటున్నాయి. ఏ ఒక్కరు ఇప్పుడు కంట్రోల్ తప్పినా.. సంక్షోభ పరిస్థితులు ఎదుర్కోకతప్పదు. ఇప్పటికే ఎయిర్‌ క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లను మిడిల్‌ఈస్ట్‌లో మోహరించింది. విడతల వారీగా యెమెన్‌లోని హౌతీ స్థావరాలపై దాడులు చేస్తోంది. ఇక ఇరాన్ కూడా తామేక్కడ తగ్గేదేలే అన్నట్టుగా మిసైల్ సిటీ వీడియోలను రిలీజ్ చేస్తోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com