ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్‌గా భారత గ్రాండ్ మాస్టర్ డి గుకేశ్ నిలిచాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ 14వ చివరి రౌండ్‌లో గుకేశ్ చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించాడు.
18 సంవత్సరాల డి గుకేష్ పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. దీంతో గుకేష్ ఏం చదివాడు… ఏ ప్రాంతానికి చెందనవాడని ఆసక్తి పెరిగింది. భారతదేశపు అతి పిన్న వయసు గ్రాండ్ మాస్టర్ అయ్యాడు. గుకేశ్ 12 సంవత్సరాల ఏడు నెలల 17 రోజుల వయస్సులో ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు 18 ఏళ్లకే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా 36 ఏళ్ల తర్వాత భారత్ కు విజయం అందించాడు. చెన్నైలో డి గుకేష్ పాఠశాల చాలా ప్రత్యేకమైనది కాగా దీనికి చెస్ ఫ్యాక్టరీ అనే పేరుంది.
చెన్నై నివాసి అయిన గుకేశ్ పూర్తి పేరు దొమ్మిరాజు గుకేష్. తండ్రి రజనీకాంత్ కళ్ల డాక్టర్ కాగా తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్ గా . ఇద్దరూ విద్యావంతులు కావడంతో ఈ యంగ్ ప్లేయర్ చెస్ ఆటలో ఎత్తులకు పైఎత్తులు వేసి ప్రత్యర్థులను చిత్తు చేయడం నేర్చుకున్నాడు. గుకేష్ ఏడేళ్ల వయసులోనే చదరంగం నేర్చుకోవడం ప్రారంభించాడు. చెస్ కోచింగ్ లో తొలి గురువు భాస్కర్. తరువాత అతను విశ్వనాథన్ ఆనంద్ వద్ద శిక్షణ పొందాడు.
అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ఛాంపియన్ డి గుకేష్ నాల్గవ తరగతి వరకు మాత్రమే అధికారిక పాఠశాల విద్యను కలిగి ఉన్నాడు. అతను చెన్నైలోని వేలమ్మాళ్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదువుకునేవాడు. ఒక ఇంటర్వ్యూలో గుకేశ్ తండ్రి క్రీడలు, చదువుల మధ్య సమతుల్యతను సృష్టించడానికే తమ కుమారుడు గుకేష్ నాల్గవ తరగతి తర్వాత సాధారణ చదువును విడిచిపెట్టాడని తెలిపారు. గుకేష్ ప్రొఫెషనల్ చెస్ ఆడటం ప్రారంభించినప్పుడు, అతను ఆ తర్వాత వార్షిక పరీక్షకు హాజరు కాలేదు.
చెన్నైలోని వేలమ్మాళ్ మెట్రిక్యులేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్ (మొగప్పైర్ బ్రాంచ్)ని చెస్ ఫ్యాక్టరీ అంటారు. 17 మంది భారతీయ గ్రాండ్ మాస్టర్లు డి గుకేశ్ ప్రజ్ఞానంద్, ఎ అధిబన్ మరియు ఎస్పీ సేతురామన్ ఈ పాఠశాల నుండి పట్టభద్రులయ్యారు. ఈ పాఠశాల వేలమ్మాళ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈ పాఠశాల 1986లో స్థాపించబడింది. ఇప్పుడు గుకేష్ సాధించిన విజయం కేవలం అతని ఒక్కరికే కాదు.. యావత్ దేశ ప్రజలందరిని గర్వించే విధంగా తన ప్రతిభను చాటుకున్నాడు. అందుకే దేశ ప్రధాని మోదీ నుంచి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వరకు అందరూ గుకేష్ ని అభినందిస్తూ ట్వీట్ లు పెడుతున్నారు.