భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇకపై ఏ ఉగ్రవాద చర్య జరిగినా అది యాక్ట్ ఆఫ్ వార్ కింద పరిగణించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో ఈ రోజు ఢిల్లీలో జరిగిన అత్యున్న స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రధానమంత్రితో జరిగిన సమావేశంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోంశాఖమంత్రి అమిత్ షా, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఏదేని టెర్రరిస్టు గ్రూపు దేశంలో హింసాకాండకు పాల్పడితే ఇక నుంచి ప్రభుత్వ స్పందన తీవ్రంగా ఉండనుంది.
మరోవైపు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) వద్ద భద్రతా చర్యలను పటిష్టం చేస్తున్నారు. పాకిస్తాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇస్రో కార్యాలయాల వద్ద భద్రత పెంచారు. ఇందులో భాగంగా ఈ రోజు (శనివారం) ఉదయం 9:30 నుండి 11:30 గంటల వరకు, శ్రీహరికోటలోని షార్‌లో, సిఐఎస్‌ఎఫ్ డిఐజి సంజయ్ కుమార్ నేతృత్వంలో మాక్ డ్రిల్ నిర్వహించారు.