బంగ్లాదేశ్ లో భారత వ్యతిరేకత నానాటికి పెరుగుతోంది. జమాతే ఇస్లామీ సంస్థ తెర వెనుక ఉండి నడిపిస్తున్న ఆందోళనలు బంగ్లాదేశ్ ను సంక్షోభంలో కూరుకుపోయేలా చేస్తున్నాయి. అగర్తలా నుండి ఢాకా మీదుగా కలకత్తా వెళుతున్న భారత బస్సు పై బంగ్లాదేశ్ లో దాడి జరిగింది.
బ్రాహ్మణబారియా జిల్లాలోని బిష్వారోడ్డు మీద బస్సును ట్రక్కుతో ఢీ కొట్టారు. ట్రక్కు ఢీకొట్టడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. ఉద్దేశ్యపూర్వకంగానే భారత బస్సుపై ట్రక్కుతో దాడి చేసినట్టు ఆ దేశ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
భారత ప్రయాణీకులను చంపుతామంటూ స్ధానికులు బెదిరించడమే కాకుండా అసభ్యకరపదజాతంతో తిట్టారు. దుండగులు భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వివరాల్లోకి వెళితే బంగ్లాదేశ్ రూ.135 కోట్లు బకాయి పడిందని త్రిపుర విద్యుత్ శాఖ మంత్రి రతన్ లాల్ నాథ్ ఆదివారం తెలిపారు. ఇప్పటి వరకూ ఉన్న విద్యుత్ బకాయిలను తక్షణమే చెల్లించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. త్రిపుర రాజధాని అగర్తలలోని ILS హాస్పిటల్ లో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోగులకు చికిత్స చేయమని ప్రకటించింది. పొరుగు దేశంలో హిందువులపై జరిగిన అఘాయిత్యాలు, బంగ్లాదేశ్‌లో భారతీయుల బస్సుపై దాడి తర్వాత త్రిపుర ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వివాదం పెరిగి దాడులకు దారితీసిందని అంటున్నారు.