1. మహా కుంభమేళ సందర్శనకి వెళ్లే వారు ట్రైన్ ద్వారా మాత్రమే వెళితే సౌకర్యంగా ఉంటుందని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సూచిస్తోంది. బస్సు ద్వారా వెళ్తే 16 కిలోమీటర్ల దూరంలో పోలీస్ లు ఆపేస్తారు. అక్కడ నుండి నడుచుకుంటూ మేళాకి వెళ్ళాలి.
2. కుంభమేళాకు వెళ్లినవారి సౌకర్యం కోసం మేళాని సెక్టార్ లు గా, కాటున్ పాండ్స్ గా, ఘాట్స్ గా ప్రభుత్వం విభజించింది. వాటిపై అవగాహన పెంచుకుని వెళితే బాగుంటుంది. లేకపోతే అస్సలు ఏమి అర్ధం కాదు, ఎటు వెళ్లి ఎటు వస్తారో అర్ధం కాదు.
3. మొత్తం 24 సెక్టార్స్ ఉంటాయి
4. 16-17 కాంటూన్ పాండ్స్ ఉంటాయి. (నదికి మధ్యలో బ్రిడ్జిలు నిర్మించారు. వాటినే కాంటూన్ పాండ్స్ అంటారు )
4. ప్రయాగ రాజ్ ని మూడు భాగాలుగా విభజించారు
A. జ్యూస్సి, B. హరిలా గంజ్ C. సంగం
5. నదికి కుడి వైపు జ్యూస్సి ఉంటుంది దీనిలో సెక్టార్ 12 నుండి 21 వరకు ఉంటాయి.
6. హరిలాగంజ్. ఇది నది దాటి ఎడమ వైపున ఉంటుంది. దీనిలో సెక్టార్ (5,6,7,8,9,10,11,18,19) ఉంటాయి.
7. ముఖ్యమైంది సంగం, ఇది మెయిన్ రోడ్ కి దగరలో ఉంటుంది దీనిలో సెక్టార్ 3,4 ఉంటాయి.
8. మిగతావి 22,23, చాలా దూరంలో ఉంటాయి.
వసతి సదుపాయాలు
9. సెక్టర్ 6 లో TTD వాళ్లు వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు తప్పకుండ సందర్శించాల్సిన ప్రాంతం. అయితే అక్ ఎక్కువసేపు ఉండనివ్వరు.. బస చేసేందుకు అవకాశం లేదు. స్వామి వారికీ బంగారు ఆభరణాలు ఉండడం వల్ల వాళ్ళు హై సెక్యూరిటీ పెట్టి ఎవరిని పడుకొనివ్వరు.
10. మీరు అక్కడ హిందీ వాళ్లవి పెద్ద పెద్ద పీఠాలకు సంబంధించి భజన కేంద్రాలు వున్నాయి. చక్కగా అక్కడ పడుకోవచ్చు. (ముఖ్యంగా సెక్టార్ 18 లో బస చేయవచ్చు. నదికి 100 మీటర్లు దూరంలో ఉంటాయి.)
11. సెక్టర్ 19,18,20 ఈ సెక్టర్స్ లో నాగసాధువులు, అఘోరాలు వుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏంతో ప్రేమతో వారు తమ దగ్గరే ఉండమంటారు చక్కగా ఉండొచ్చు.
12. సెక్టార్ 1లో ప్రైవేటు వసతి సదుపాయాలు ఉంటాయి రోజుకి 200 రూపాయలు
13. అన్ని సెక్టార్ లలో పెయిడ్ వసతులు కలవు. రోజుకి 1000 -2000 రూపాయలు తీసుకుంటారు (4 మెంబర్స్ వరకు ఉండొచ్చు)
భోజనం సదుపాయాలు
14. కుంభమేళా అన్ని సెక్టార్లలో ప్రసాదాలు, భోజనాలు నిరంతరం ఉంటాయి. ఉత్తర భారతదేశం వంటకాలు అన్ని అక్కడ ఉచితంగా స్వీకరించవచ్చు…
హెల్ప్ లైన్
16. కుంభమేళా వెళ్లే భక్తులకు రైల్వే స్టేషన్ నుండి అడుగడుగునా పోలీస్ లు గైడ్ చేస్తారు.
17. మేళా లో అయితే పోలీస్ లు అడుగడుగునా ఎటువైపు వెళ్లాలో మనకు చాలా బాగా చెప్తారు.
స్నానం ఎలా
18. ఎవరైతే పుణ్యం స్నానం చేసి రిటర్న్ అవ్వాలనుకుంటారో స్నాన ఘాట్ లు మెయిన్ రోడ్ పక్కనే ఉంటాయి వరుసగా.
19. 2-3 రోజులు వుండే వాళ్లు మాత్రమే ఎదో ఒక సెక్టార్ నదికి దగ్గర వుంటుంది అక్కడే ఉండడం మంచిది, లేకపోతే నదికి, సెక్టార్ కి దూరమైతే తప్పిపోయే అవకాశం కలదు
నాగసాధువులు, అఘోరాలు, అఖడాలను చూడాలి, వాళ్ళ ఆశీర్వదాలు తీసుకోవాలనుకుంటే సెక్టార్ 18,19, 20 లో వుంటారు.
చివరిగా కుంభమేళాకు వెళ్లే ప్రతి ఒకరు తప్పక చెయ్య వలిసినది పవిత్ర అమృత స్నానం. కుటుంబం, బంధుమిత్రులతో ప్రయాగ్ రాజ్ వెళ్లే వారు అన్నీ తెలుసుకుని వెళితే బాగుంటుంది. లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవల్సి ఉంటుంది.
కుంభమేళాకు వెళ్లే వారు ఒంటరిగా కంటే నలుగురు బ్రందంగా వెళ్తే చాలా మంచిది.
ఎన్నికోట్లమంది వచ్చినా సరిపోయేంత విశాల ప్రాంతం ప్రయాగం రాజ్. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు పకడ్భందీగా చేసింది.