26.7 C
Hyderabad
Saturday, April 25, 2026

Live Video

spot_img

దమ్ముంటే మెట్రో నేను అడ్డుకున్నట్లు నిరూపించు

సీయం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సవాల్‌

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే తాను మెట్రో రైలు ఎక్స్‌టెన్షన్‌ ప్రాజెక్టు అడ్డుకున్నానని నిరూపించాలని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. రేవంత్‌రెడ్డివి అన్నీ గాలి మాటలని ఆయన బెదిరింపు రాజకీయాలకు నేనుభయపడనని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. సీయం బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులను అరెస్ట్‌ చేసే దమ్ములేని రేవంత్‌రెడ్డి అన్నీ మాపైన తోసేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని కిషన్‌ రెడ్డి విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీని అడిగి రెవంత్‌రెడ్డి ప్రజలకు పథకాలు హామీ ఇచ్చారా అని కిషన్‌ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల్లో హామీలిచ్చిన పథకాలకు అవసరమైన వనరులు సమకూర్చుకోవాల్సిన బాధ్యత సీయంకు లేదా అని కేంద్ర మంత్రి నిలదీశాలరు. అసలు మెట్రోరైలు విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్లానింగ్‌ ఉందా అని అడిగారు. ప్రధానమంత్రికి కాగితం ఇవ్వగానే పనులు అయిపోతాయా అని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com