పచ్చకామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనపడుతుందని బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవినీతిపరులకు అడ్డమైన పనులు చేసే అలవాటు ఉన్న వాళ్ళకి 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలకు పొలిటికల్ లోఫర్లకు ప్రతి పనిలోనూ అవినీతి, ప్రతి కార్యక్రమంలో ఎంతో కొంత చేతులు మారినట్టు అనిపిస్తుందన్నారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టివేసిన తర్వాత హైదరాబాద్ నందినగర్ లోని నివాసం వద్ద పార్టీ నాయకులతో కలిసి కెటిఆర్ మీడియాతో వివిధ ఆంశాల్ని ప్రస్తావించారు.
కెటిఆర్ కామెంట్స్ ఆయన మాటల్లోనే..
ఏదో జరిగిపోయింది అన్నట్టు కాంగ్రెస్ నాయకులు హడావుడి చేస్తున్నారు. నా మీద పెట్టింది అక్రమ కేసు, పొలిటికల్ మోటివేటెడ్ కేసు, ఏమీ లేని లొట్టపీసు కేసు అని తెలిసినా ఏసీబీ విచారణకు వెళ్లాను. భారత పౌరుడిగా చట్టాన్ని రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి పెడుతున్న అక్రమ కేసులను రాజ్యాంగపరంగా న్యాయపరంగా ఎదుర్కొనేందుకు నాకున్న ప్రతి హక్కును వినియోగించుకుంటాను. ఎసిబి విచారణకు ఆఫీసుకు లాయర్ తో సహా హాజరవుతానని చెప్పాను అరగంట వేచి చూసినా ఏసీబీ అధికారులు నన్ను ప్రశ్నలు అడగడానికి వెనుక ముందైన్రు
హైకోర్టులో కేవలం క్వాష్ పిటిషన్ మాత్రమే కొట్టేశారు. దానికే కాంగ్రెస్ నాయకులు చాలా సంతోషపడుతున్నారు. నాకేదో ఉరిశిక్ష వేసినట్టు నేరారోపణ జరిగినట్టు సంకలు గుద్దుకుంటున్నారు. క్వాష్ పిటిషన్ కొట్టి వేయడంపై సుప్రీంకోర్టుకు పోతాం. కొద్ది రోజుల్లో విచారణకు వస్తుంది అక్కడ కూడా న్యాయపోరాటం చేస్తా.
చట్టాన్ని గౌరవించే పౌరుడిగా నేను విచారణకు హాజరయ్యాను కానీ లాయర్లతో రావద్దన్నారు. పట్నం నరేందర్ రెడ్డి ఇవ్వని స్టేట్మెంట్ను ఇచ్చినట్టు మీడియాకి లీకులు వదిలి సతాయించారు. అందుకే లాయర్ల సమక్షంలోనే నా విచారణ జరగాలని రేపు హైకోర్టుకు వెళుతున్నాను. ఈ దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించాలని కోర్టుకు వెళుతున్నాను. కొందరు మంత్రులు న్యాయమూర్తులై వాళ్ళే శిక్షలు వేస్తున్నారు. ట్రయల్ మీడియాలో, సెక్రటేరియట్లో, మంత్రుల పేషీలో జరగదు. ట్రయల్ న్యాయస్థానాల్లోనే జరుగుతుంది.
మళ్లీ చెప్తున్నా రూపాయి అవినీతి కూడా జరగలేదు. తెలంగాణ కోసం తెలంగాణ ఇమేజ్ ను ఆకాశమంత ఎత్తుకు తీసుకపోయేందుకు భారతదేశంలోనే కాదు ప్రపంచ పటంలో హైదరాబాద్ ను విశ్వ నగరంగా చేసేందుకే నిర్ణయం తీసుకున్నాను తప్ప ఏమీ ఆశించి కాదు. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ వాహనాలన్నిటికీ ప్రధాన కేంద్రంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దాలన్న సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయమే ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ.
కాంగ్రెస్ నాయకులలాగా దివాలా కోరు పనులు చేయాల్సిన కర్మ మాకు లేదు. లాయర్లతో విచారణకు రేపు హైకోర్టు అనుమతిస్తే ఎల్లుండి 9వ తారీకు ఏసీబీ విచారణకు లాయర్లతో వెళతాను. 16వ తారీఖు నాడు ఈడీ విచారణకు కూడా హాజరవుతాను. వారు ఏమి అడిగినా సమాధానం చెప్తాను నాకు దాపరికం లేదు దాయాల్సింది ఏమీ లేదు.
నిజాయితీకి ధైర్యం ఎక్కువ . రేషంగళ్ళ తెలంగాణ బిడ్డగా ఏ విచారణను ఎదుర్కోడానికైనా నేను సిద్ధం ఇందులో ఎలాంటి శషభిషలు లేవు. నేను నేరం చేసినట్టు హైకోర్టు ఎక్కడ చెప్పలేదు నాకు శిక్ష వేయలేదు. కనీసం స్కామ్ జరిగినట్టు కూడా ఎక్కడ అనలేదు. పత్రికా మిత్రులు ఆగం కావద్దు. ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చేది వేదవాక్కు కాదు లీకులు ఇచ్చి అసత్యాలను ప్రచారం చేస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టమని మేము కోరితే ముఖ్యమంత్రి పారిపోయాడు. రేవంత్ రెడ్డి మగాడు అయితే తన జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో చర్చ పెడితే మీడియా సమక్షంలో నేను చర్చకు రెడీ. ఆ తర్వాత ఏసీబీ విచారణకైనా ఈడీ విచారణకైనా రెడీ. కాంగ్రెస్ నాయకుల ఇంట్రెస్ట్ ఫార్ములా ఈ . మా ఇంట్రెస్ట్ ఫార్మర్. మేము రైతు భరోసా గురించి మాట్లాడతాం. డైవర్షన్ కోసం రేవంత్ ఏం చేస్తున్నాడో మాకు తెలుసు.
విధ్వంసం, అటెన్షన్ డైవర్షన్, మోసం చేయడం ఇదే కాంగ్రెస్ నైజం. రైతు భరోసా ఎప్పుడు వస్తుందని 75 లక్షల మంది అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. కెసిఆర్ సార్ 12సార్లు రైతుబంధు ఇస్తే చిట్టి నాయుడు ఒక్కసారి కూడా ఇవ్వలేదు. ఈసారైనా ఇస్తాడా అని తెలంగాణ రైతులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు వాళ్లకు న్యాయం జరిగేంత వరకు కొట్లాడాలని మా బి ఆర్ ఎస్ నాయకులకు చెప్పిన.
పార్టీ నిర్మాణంపై 6 గ్యారంటీల అమల్లో కాంగ్రెస్ చూపుతున్న నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ నేతలు దృష్టి పెట్టాలని సూచించాను. అటెన్షన్ డైవర్షన్ తో కాంగ్రెస్ ఆడుతున్న నాటకాన్ని ప్రజల ముందు బట్టబయలు చేయాలని మా నాయకులకు చెప్పాను. ఫార్ములా కేసు విషయంలో మీడియా చేస్తున్న హడావుడికి టిఆర్ఎస్ కార్యకర్తలు ఆగం కావద్దు.
ఫార్ములా కేసు విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్న మీడియా, ప్రజలు పడుతున్న బాధల్ని చూపించడంలోనూ చూపించాలి. హైడ్రా మూసి బాధితుల కష్టాలను మీడియాలో చూపించండి. ఆరు గ్యారంటీల అమలు ఫెయిల్ అయ్యి సంవత్సరం తర్వాత అటెన్షన్ డైవర్షన్ కోసం రేవంత్ రెడ్డి పడుతున్న పాట్లను కూడా అప్పుడప్పుడు చూపించండి. ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆటో డ్రైవర్లు, చనిపోతున్న నేతన్నలు, గురుకులాల్లో ఉన్న అద్వాన్న పరిస్థితుల మీద కూడా మీడియా దృష్టి పెట్టాలని కోరుతున్నాం.
బిజెపి కాంగ్రెస్ వేరు కాదు. రక్షణ కవచం లాగా కాంగ్రెస్కు బిజెపి పని చేస్తుంది. రెండు పార్టీలు ఒకటికొకటి పెనవేసుకుని కలిసి పనిచేస్తున్నాయి. ఇది కొత్త కాదు. గతంలోనూ చూసాం భవిష్యత్తులోనూ చూస్తాం ఈ రెండు పార్టీలను చిత్తుచేసి అధికారంలోకి వచ్చాం. అక్రమ కేసులపై న్యాయస్థానాల్లోను గెలుస్తాం. ప్రజాక్షేత్రంలో ఈ రెండు పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించి తిరిగి అధికారంలోకి వస్తాం.
మెగా ఇంజనీరింగ్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి వందల కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చింది. క్విడ్ ప్రో కో లో భాగంగానే మెగా కంపెనీకి, మీ రాఘవ కంపెనీకి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను రేవంత్ రెడ్డి ఇచ్చిండని అంటే ఎలా ఉంటుంది? మీకు సమ్మతమేనా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. గ్రీన్ కో కంపెనీ నుంచి ఎలక్ట్రోరల్ బాండ్లు అందుకొని రాజకీయ పార్టీ తెలంగాణలో ఏదైనా ఉందా?
ఒక బీఆర్ఎస్కే కాదు కాంగ్రెస్ బిజెపి టిడిపి వైఎస్ఆర్సిపి ఇలా అన్ని పార్టీలకు గ్రీన్కో బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చింది ఒక్క టిఆర్ఎస్ పార్టీ మీదనే కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఏడుస్తున్నారు ? క్విడ్ ప్రో కో అంటే అర్థం కాంగ్రెస్ నాయకులకు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలుసా? బీఆర్ఎస్ పార్టీకి విరాళాలు ఇచ్చిన గ్రీన్ కో కు ప్రతిఫలంగా ఏం దక్కిందో నిరూపించగలరా?
మీడియా కూడా బాధ్యతతో వ్యవహరించాలి. ప్రభుత్వం చెబుతున్న అర్థసత్యాలను ఫాక్ట్ చెక్ చేసుకోవాలి. 4000 కోట్ల రూపాయల మల్లన్న సాగర్ పనులు కూడా మెగా ఇంజనీరింగ్ కి రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నట్టు సమాచారం ఉంది. అది కూడా క్విడ్ ప్రో కోలో భాగంగానే ఇస్తున్నాడా? మూసి ప్రాజెక్టు కూడా మెగాకే ఇచ్చారు ఇది కూడా క్విడ్ ప్రో కోలో భాగంగానే ఇచ్చారా?
సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయాక మెగా ఇంజనీరింగ్ ను బ్లాక్ చేయాలని హెచ్ఎం డబ్ల్యూ ఎస్ ఎస్ బి ఇచ్చిన రిపోర్టును ఎందుకు రేవంత్ రెడ్డి అమలు చేయడం లేదు. మెగా ఇచ్చిన ఎలక్ట్రోరల్ బాండ్లకు ప్రతిఫలంగానే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదా ? ఒక కాంట్రాక్టర్ మంత్రిగా ఉంటే ఇంకో బ్రోకర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎవరెవరి దగ్గ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు గుంజుకుంటున్నాడు 30 – 40% భూమిని ఎలా రాపించుకుంటున్నాడో మా దగ్గర సమాచారం ఉంది. ఫోన్ టాపింగ్, కాళేశ్వరం, జన్వాడ, హైడ్రా అంటూ వన్ ఇయర్ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కాలక్షేపం చేస్తుంది. న్యాయ వ్యవస్థ పై నాకు సంపూర్ణమైన విశ్వాసం గౌరవం ఉన్నాయి అక్రమ కేసులపై అక్కడే తెలుసుకుంటాను.