భూకంపం మొత్తం ఐదు దేశాలను వణికించింది. టిబెట్, నేపాల్, బంగ్లాదేశ్, భారతదేశం, ఇరాన్ దేశాల్లో బలమైన భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం టిబెట్, నేపాల్ గా సరిహద్దుల్లో కేంద్రీక్రతమైంది.
ఈ భూకంపం ఉత్తర భారతదేశంలోని అనేక నగరాలను ప్రభావితం చేసింది. భూకంపం కారణంగా టిబెట్‌లో చాలా మంది మరణించారు. భారత్‌లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. టిబెట్‌లో పెను విధ్వంసం చోటుచేసుకుంది.
రిక్టర్ స్కేలుపై నేపాల్ లో భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. దీనివల్ల సుమారు 1000 కి పైగా ఇల్లు దెబ్బ తిన్నాయని వెల్లడించింది, టిబెట్‌లోని అనేక కుటుంబాలకు భూకంపం తీరని బాధను మిగిల్చింది. మంగళవారం తెల్లవారు జామున టిబెట్, నేపాల్‌లో భూకంప ప్రకంపనలతో హిమాలయా పర్వత శిఖరాల్లో విషాదం చోటుచేసుకుంది.
భారతదేశం, బంగ్లాదేశ్‌లోని అనేక ప్రాంతాలలో భూకంప ప్రకంపనలు సంభవించాయి. అయితే ఈ భూకంపం కేంద్రం టిబెట్. అక్కడ 7.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. నేపాల్ సరిహద్దు సమీపంలోని టిబెట్ ప్రాంతంలో సంభవించిన శక్తివంతమైన భూకంపంలో ఇప్పటివరకు 95 మంది మరణించారని, 130 మంది గాయపడినట్లు తెలుస్తోంది.