ప్రాణం ఉన్నంత వరకు బీఆర్ ఎస్ పార్టీలోనే ఉంటానని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తేల్చి చెప్పారు. పార్టీ మారుతానని తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని పల్లా మండిపడ్డారు. జనగామలో పార్టీ సమావేశంలో శనివారం పాల్గొన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి…అసత్య ప్రచారాలను నమ్మొద్దని పార్టీ శ్రేణులను కోరారు.
జనగామ ప్రజలు కారు మీద పోటీ చేసిన నన్ను గెలిపించారని, ప్రజల నమ్మకాన్ని నిలబెడతానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాదిరిగా స్వార్థం కోసం పార్టీలు మారే మనస్తత్వం తనది కాదని వెల్లడించారు.
ప్రజా సమస్యల మీద శాసనసభలో సరిగా మాట్లాడటంలేదని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, వాటిని నమ్మొద్దన్నారు. గులాబీ జెండా మీద గెలిచిన తాను పార్టీ మారే ప్రసక్తే లేదని వివరించారు.