విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్.. ఇలా సీనియర్లంతా దేశవాళీ టోర్నీలు ఆడతారా? లేదా? అనే ప్రశ్నలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతూ.. టీమిండియా ఓటమికి తాము చేయాల్సిందంతా చేస్తూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వీరంతా రంజీ మ్యాచ్‌ల్లో ఆడతారని ప్రచారం జరిగింది. ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అయితే తమ రంజీ స్క్వాడ్‌లో కోహ్లీ, పంత్‌కు ప్లేస్‌కు కూడా ఫిక్స్ చేసింది. కానీ వీరేవ్వరూ కూడా రంజీలు ఆడే చాన్స్ లేదని తేలిపోయింది. అయితే మరికొందరు మాత్రం రంజీల్లో తమ సత్తా చాటేందుకు రెడీగా ఉన్నారు.
విరాట్ కోహ్లీ..
తాను రంజీ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధంగా లేనట్టు విరాట్ బీసీసీఐ పెద్దలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. సిడ్నీ టెస్ట్‌లో తనకు మెడ నొప్పి ప్రారంభమైందని.. దాని కోసం ఇప్పటికే చికిత్స తీసుకున్నట్టు బోర్డుకు తెలిపాడు కోహ్లీ. అయితే ముందు చాంపియన్స్ ట్రోఫీ ఉండటంతో అతడికి విశ్రాంతి అవసరం అనే ఆలోచనలో ఉంది బీసీసీఐ. దీంతో కోహ్లీ రంజీల్లో ఆడే అవకాశం లేనట్టే.
కేఎల్ రాహుల్..
కేఎల్ రాహుల్ కూడా కర్ణాటక నుంచి బరిలోకి దిగుతాడని అంతా ఊహించారు. కానీ మోచేతి నొప్పి కారణంగా తాను కూడా అందుబాటులో ఉండనని ఇప్పటికే బోర్డుకు తెలిపారు కేఎల్. దీంతో పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో అతడిని పక్కన పెట్టేసింది కర్ణాటక.
రోహిత్ శర్మ..
రోహిత్ శర్మ ఇప్పటికే ముంబై తరపున బరిలోకి దిగుతాడన్న నమ్మకం చాలా మందిలో ఉంది. ఇప్పటికే ముంబై రంజీ టీమ్‌తో కలిసి ప్రాక్టీస్ కూడా చేశాడు రోహిత్. అయితే గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇస్తాడా? లేదా? అనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు.
రవీంద్ర జడేజా..
రవీంద్ర జడేజా మాత్రం రంజీల్లో తన సత్తా చాటనున్నాడు. సౌరాష్ట్ర నుంచి బరిలోకి దిగుతున్నాడు జడ్డూ.
శుభ్‌మన్ గిల్..
మరోసారి తనేవరో ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది గిల్‌కు. ఇప్పటికే పంజాబ్ తరపున బరిలోకి దిగుతున్నాడు గిల్. సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్‌లో తన సత్తా ఏంటో చూపించేందుకు రెడీ అయ్యాడు.
రిషబ్ పంత్..
రిషబ్ పంత్ కూడా తాను మ్యాచ్‌కు అందుబాటులో ఉంటానని ఢిల్లీ మేనేజ్‌మెంట్‌కు సమాచారం ఇచ్చాడు. అయితే క్యాప్టెన్సీ పగ్గాలు చేపట్టేందుకు మాత్రం అంగీకరించలేదు. అయితే అధికారికంగా ఇంకా టీమ్‌ను కన్ఫామ్ చేయలేదు. కానీ పంత్ ఆడటం మాత్రం ఖరారైందని తెలుస్తోంది.