- డిజిటల్ మూల్యాంకనం నిర్ణయం అప్పటి చైర్మన్ ఉదయ భాస్కర్ దే
- న్యాయస్ధానంలో వాదనలు వినిపించిన సీనీయర్ ఐపీఎస్ పీఎస్‌ఆర్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యదర్శిగా నేను ఉన్న కాలంలో గ్రూప్-1 పరీక్ష పత్రాలకు సంబంధించి ఎటువంటి మాన్యువల్ వాల్యుయేషన్ చేయలేదని సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్‌ఆర్ ఆంజనేయులు న్యాయస్ధానానికి నివేదించారు. అసలు మాన్యువల్ మూల్యాంకనం నా హయాంలో జరగనప్పుడు అవకతవకలకు, కుంభకోణానికి అవకాశమే లేదని ఆయన న్యాయస్ధానం ముందు తన వాదనలను వినిపించారు. తనుండగా మాన్యువల్ మూల్యాంకనం కోసం కామ్‌సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని పీఎస్‌ఆర్ చెప్పారు. తనపై మాన్యువల్ వాల్యుయేషన్ లో అక్రమాలు చేసినట్లు పోలీసులు నమోదు చేసిన అభియోగాలు పూర్తాగా అవాస్తవమని కోర్టుకు తెలియజేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష పత్రాల వేల్యుయేషన్ లో అవకతవకలకు పాల్పడినట్లు కూటమి సర్కార్ నమోదు చేసిన కేసులో పీఎస్‌ఆర్ ఆంజనేయులుపై దాఖలు చేసిన పీటీ వారెంట్‌ను విజయవాడ న్యాయస్ధానం విచారించింది. దీనిపై పీఆర్‌ఎస్ ఆంజనేయులు న్యాయస్ధానంలో తన వాదనలను స్వయంగా వినిపించారు.
అప్పుడు ఉన్న ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ భాస్కర్ గ్రూప్ -1 జవాబు పత్రాలను డిజిటల్ మూల్యాంకనం చేయాలని ప్రతిపాదించగా ఆయన చెప్పిన విధంగానే మూల్యాంకనం చేశామని కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. అయితే డిజిటల్ వాల్యుయేషన్ పై కొంతమంది అభ్యర్ధులు న్యాయస్ధానాన్ని ఆశ్రయించడంతో కోర్టు మాన్యువల్ వేల్యుయేషన్ చేయాలని ఆదేశించిందని కోర్టుకు తెలిపారు. అయితే దీనిపై చైర్మన్ ఉదయ భాస్కర్, ఇతర కమీషన్ సభ్యులు సహకరించకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్ళాలనే అంశంపై కొద్ది రోజులు తర్జనభర్జన పడ్డామని కోర్టకు తెలియజేశారు. ఉదయ భాస్కర్ తరువాత ఇన్ ఛార్జ్ చైర్మన్ గా నియమించబడ్డ రమణారెడ్డి కొద్దికాలమే పదవిలో ఉన్నారని, ఇంతలో నాకు డీజీగా పదోన్నతి అభించిందిని నన్న బదిలీ చేయడంతో పాటు ఏపీపీఎస్సీకి కొత్త చైర్మన్ ని నియమిస్తారని తెలియడంతో నేను మాన్యువల్ మూల్యాంకనంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పీఆఎస్‌ఆర్ ఆంజనేయులు కోర్టకు నివేదించారు. అనంతరం ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమితులైన గౌతమ్ సావంగ్ కి పరిస్ధితి మొత్తం వివరించగా ఆయన మాన్యువల్ మూల్యాంకనం చేద్దామని అన్నారని తెలిపారు. నేను బదిలీ అయిన తరువాతే సవాంగ్ మాన్యువల్ మూల్యాంకనం చేయించారని కోర్టు దృష్టికి తీసుకు వెళ్ళారు. మాన్యువల్ మూల్యాంకనం నేను కార్యదర్శిగా ఉన్న సమయంలో చేసినట్లు పోలీసులు అభియోగాలు మోపడం పూర్తాగా అవాస్తవమని పీఎస్‌ఆర్ ఆంజనేయులు న్యాయస్ధానం ముందు తన వాదనలను వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత పీఎస్‌ఆర్ ఆంజనేయులుకు కోట్టు ఈ నెల 22వ తేదీ వరకూ రిమాండ్ విధించింది.