అత్యంత ఖరీదైన 17 ఎకరాల భూమిని కబ్జా కోరల్లోంచి రక్షించింది హైడ్రా. ఒక హై ప్రొఫైల్ రాజకీయ నాయకుడి కబ్జాలో ఉన్న ఈ భూమిలో ఉన్న నిర్మాణాలను శనివారం హైడ్రా సమూలంగా కూల్చివేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ ఆధీనంలో ఉన్న ఈ భూమిని శనివారం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. హైడ్రా ఈ చర్యతో రెండు రాష్ట్రాల్లో ఒక్కసారిగా రాజక ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హఫీజ్ పేట పరిధిలో ఉన్న ఈ పదిహేడు ఎకరాల ప్రభుత్వ భూముల ఉన్న ఆక్రమణలన్నీ హైడ్రా సిబ్బంది నేలమట్టం చేశారు. ఈ భూముల ఆక్రమణల్లో బడా బాబులు ఉన్నా ఎవరి ఒత్తిళ్ళను లెక్క చెయ్యకుండా హైడ్రా కమీషనర్ రంగనాథ్ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా హైడ్రా చర్యతో ఏడు కాలనీలకు విమిక్తి లభించిందంటూ ఇంజాపూర్ కాలనీ వాసులు హైడ్రా జిందాబాద్ అంటూ స్వీట్లు పంచిపెట్టారు. వనస్ధలిపురం ఇంజాపూర్ రహదారి ఆక్రమణలను కూల్చివేయడంతో తమ రాకపోకలకు అడ్డు తొలగిపోయిందని స్థానికులు ఆనందం వెలిబుచ్చారు.
తన ఆధీనంలో ఉన్న స్ధలంలో భవనాలు హైడ్రా కూల్చివేయడంపై వసంత కృష్ణ ప్రసాద్ స్పందించారు. తాను 2005లో ఈ భూమిని కొనుగోలు చేశానని తెలిపారు. ఈ భూమిపై ఎటువంటి అభ్యంతరాలు లేవని రంగారెడ్డి కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. స్వయంగా హైడ్రా కమీషనర్ రంగనాథ్ ను కలిసి భూమికి సంబంధించిన పత్రాలు అందజేశామని చెప్పారు. అయినా హైడ్రా అధికారులు తమ ఆఫీసు మొత్తాన్ని కూల్చేశారని వసంత కృష్ణప్రసాద్ అన్నారు.