33.2 C
Hyderabad
Saturday, October 31, 2026

Live Video

spot_img

తెలంగాణ మంత్రి పదవి కోసం అమెరికా రికమండేషన్‌!

తెలంగాణలో మంత్రి పదవికి అమెరికా నుంచి రికమండేషన్? ఆశ్చర్యంగా ఉంది కదా! కానీ ఇది నిజమేనట. రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ఒక మంత్రి పదవి కోసం అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్వయంగా కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీకి సిఫారసు లేఖ రాసినట్టు వార్తలు వస్తున్నాయి.

ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇప్పించాలని ఆమె రాసిన లేఖ చూసి రాహుల్ గాంధీ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు గడిచినా, ఇప్పటికీ మంత్రివర్గ విస్తరణ ప్రక్రియ పూర్తి కాలేదు. ప్రస్తుతం కేబినెట్‌లో 12 మంది మంత్రులు ఉండగా, ఇంకా ఆరుగురికి అవకాశం ఉంది.

ఈ ఖాళీల్లో బెర్త్‌లను ఆశిస్తున్న వాళ్లు కేబినెట్‌లో చోటు దక్కించుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. అయితే మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం ఎప్పటిలానే వాయిదాలు వేస్తూ వస్తోంది. మంత్రివర్గ విస్తరణ నిరవధిక వాయిదా వేసినట్లు గాంధీభవన్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ పట్ల అసంతృప్తి పెరిగింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ సమావేశాలకు హాజరుకాకుండా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారట.

ఇలాంటి పరిస్థితుల్లో, రికార్డులు తిరగరాయించే ప్రయత్నంగా ఒక సీనియర్ ఎమ్మెల్యే ఏకంగా అమెరికా నుంచి సిఫారసు చేయించుకోవడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆ ఎమ్మెల్యే కమలా హారిస్ ద్వారా ఢిల్లోలీ ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ కు లేఖ రాయించారని తెలుస్తోంది. ఈ విషయం బయటకు రావడంతో మిగతా ఆశావాహులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఒక రాష్ట్ర మంత్రి పదవికి అమెరికా స్థాయి నుంచి లేఖ రావడం ఇదే మొదటిసారేమో అనే చర్చలు కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. బీఆర్ఎస్ వర్గాలకు కూడా ఈ విషయం తెలిసి, ఇప్పుడు ఆ పార్టీ లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోందట.

ఇంతకీ కమలా హారిస్ సిఫారసు చేసిన ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కుతుందా? లేదా? అనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. అమెరికా నుంచి సిఫారసులు వచ్చాయి కానీ, అసలు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందో స్పష్టత లేక పోవటంతో ఆశావాహులు నిరాశలో మునిగిపోయారు. అలాంటి వారు పార్టీ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ కీలక సమావేశాలకు హాజరు కావడం లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com