=========================
ఈవారం పండగలు–పర్వదినాలు…
22, గురువారం, హనుమజ్జయంతి
23, శుక్రవారం, మతత్రయ ఏకాదశి.
24, శనివారం, శని త్రయోదశి.
==========================
మేషం… (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
అనుకున్న కార్యక్రమాలను ఎటువంటి పరిస్థితులు ఎదురైనా పూర్తి చేస్తారు.ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.చిన్ననాటి స్నేహితులతో మంచీచెడ్డా విచారిస్తారు.కొన్ని వ్యవహారాలలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. సమాజంలో కొన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రశంసలు అందుకుంటారు. ఎంతో నేర్పుగా అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. మీ వ్యూహాలకు తగినట్లుగానే కుటుంబసభ్యులు మసలుకుని సహకరిస్తారు. వివాహాది శుభకార్యాల ప్రస్తావనతో కుటుంబంలో ఆనందంగా గడిచిపోతుంది. ఆర్థికంగా కొంత మెరుగుపడి ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలు విస్తరిస్తారు. అనుకున్న పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఇతరుల చేయూతలేకుండానే విధులు నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. 18,19 తేదీల్లో బంధువులు, ఆత్మీయులతో విరోధాలు. అనుకోని ఖర్చులు. దూరప్రయాణాలు ఉంటాయి. సూర్యభగవానుని స్తోత్రాలు పఠించండి.
వృషభం… (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, వృగశిర 1,2 పాదాలు)
కీలక నిర్ణయాలను తీసుకుంటారు. కొన్ని కార్యక్రమాలు శ్రమపడ్డా పూర్తి చేస్తారు. బంధువులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి వారి నుంచి కొన్ని ఉపకారాలు పొందుతారు.కుటుంబంలో ఒత్తిడులు, సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. ఎంతోకాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులు ప్రతిభాపాటవాలకు మరింత పదును పెట్టే సమయం. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, స్థలాలు కొనేందుకు యత్నిస్తారు. ఆపదలో ఉన్న వారికి స్నేహహస్తం అందిస్తారు. చిరకాల ప్రత్యర్థులను కూడా ఆకట్టుకుంటారు. వ్యాపారాలు విస్తరణ యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. రాజకీయవేత్తలు పదవుల వేటలో కొంత అలసట చెందినా ఫలితం పొందుతారు. 21,22 తేదీల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. అనుకోని ఖర్చులు. రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి.
మిథునం… (మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు).
ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న ఉద్యోగాలు దక్కవచ్చు. కుటుంబసభ్యులు మిమ్మల్ని మరింత ఆదరించడం విశేషం. ఆప్తుల సూచనలు మేరకు కొన్ని ప్రయాణాలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు.ఇంటి నిర్మాణయత్నాలు కలిసివస్తాయి. కొన్ని సమావేశాలలో పాల్గొంటారు. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. చీటికీమాటికీ వేధిస్తున్న సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆదాయం పొదుపు వాడుకుంటూ అప్పులకు దూరంగా ఉంటారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా సాగి లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో చిక్కులు, ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు అందుతాయి. 20,21 తేదీల్లో ఆర్థిక ఇబ్బందులు. కొత్తగా రుణాలు చేయాల్సివస్తుంది. దూరప్రయాణాలు చేస్తారు. గణేశాష్టకం పఠించండి.
కర్కాటకం… (పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష).
నూతన ఇంటర్వ్యూలు అందుతాయి. సోదరులు, సోదరీల ఆప్యాయత, ఆదరణ పొందుతారు. వ్యవహారాలలో ఆటంకాలు తొలగి ముందడుగు వేస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి కొంత గట్టెక్కే సూచనలు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. మీపై వచ్చిన అపవాదులు తొలగుతాయి. ప్రత్యర్థుల నుంచి ఊహించని సాయం అందుతుంది. చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు. ఎన్నడో దూరమైన కొందరు వ్యక్తులను తిరిగి కలుసుకుంటారు. ఆదాయానికి ఎటువంటి మార్పు ఉండదు. ఖర్చులు అదుపులోకి వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగి పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు సైతం సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవేత్తలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. 23,24 తేదీల్లో ఖర్చులు అధికం. శ్రమ తప్ప ఫలితం శూన్యం. పరిస్థితులు అంతగా అనుకూలించవు. శ్రీ రామస్తోత్రాలు పఠించండి.
సింహం… (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
ద్వేషించిన వారే సైతం ఆదరిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలను మరింత పొందుతారు. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని సమస్యలను పట్టుదలతో అధిగమిస్తారు. భూములు, వాహనాలు సమకూరతాయి. విద్యార్థుల ప్రతిభను అందరూ గుర్తిస్తారు. ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. దీర్ఘకాలిక రుణబాధల నుంచి విముక్తి. వ్యాపారాలు మరింతగా పుంజుకుంటాయి. భాగస్వాములతో సఖ్యత. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి ముందుకు సాగుతారు. రాజకీయవేత్తలకు పదవులు కొన్ని ఊరిస్తాయి. కళాకారులకు ఊహించని అవకాశాలు. 18,19 తేదీల్లో మానసిక ఆందోళన. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. అనుకోని ఖర్చులు. అనుకున్నది సాధించడంలో ఆటంకాలు. విష్ణుధ్యానం చేయండి.
కన్య… (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగించినా అవసరాలకు లోటు రాదు. రావలసిన సొమ్ము కూడా అందుతుంది. దార్మిక చింతన పెరుగుతుంది. ప్రముఖులు ఊహించని విధంగా సహకరిస్తారు. భార్యాభర్తల మధ్య స్వల్ప వివాదాలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగయత్నాలలో అనుకూలత. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నిరుద్యోగుల యత్నాలలో కదలికలు ఉంటాయి. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు దక్కే అవకాశం. పారిశ్రామికవేత్తలకు మరింత అనుకూల సమయం. 19,20 తేదీల్లో నిర్ణయాలు మార్చుకుంటారు. మిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వి«ష్ణుధ్యానం చేయండి.
తుల… (చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము మొత్తం అందుతుంది. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. సోదరులతో విభేదాలు పరిష్కారమవుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. కొత్త అవకాశాలతో నిరుద్యోగులు ఉబ్బితబ్బిబ్బవుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యాల సందడి.శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అనుకోని ప్రమోషన్లు దక్కుతాయి. రాజకీయవేత్తలకు పదవులు దక్కవచ్చు. 21,22 తేదీల్లో దుబారా ఖర్చులు. ఒత్తిడులు పెరుగుతాయి. సన్నిహితులతో మాటపడతారు. ఆదిత్యహృదయం పఠించండి.
వృశ్చికం… (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ఉద్యోగ ప్రయత్నాలు ఫలించక ఇబ్బందిపడతారు. ఓర్పుతో ముందుకు సాగడం ఉత్తమం. ముఖ్యమైన∙కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురవుతాయి. మిత్రులే శత్రువులుగా మారి కొన్ని ఇబ్బందులు కలిగిస్తారు. అనుకున్న కాంట్రాక్టులు చేజారవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఇంటి నిర్మాణాలు స్వల్ప ఆటంకాలు. వ్యాపార లావాదేవీలు కాస్త మందగిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు నిరాశ పరుస్తాయి. ఐటీ రంగం వారు, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నిరాశాజనకంగా ఉంటుంది. 18,19 తేదీల్లో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి. కుటుంబసమస్యల పరిష్కారం. గణేశాష్టకం పఠించండి.
ధనుస్సు… (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
కుటుంబంలో సందడి నెలకొంటుంది. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు. రాబడి పెరుగుతుంది. రుణబాధలు తొలగుతాయి. ప్రత్యర్థులు కూడా మీకు సహకరించి ఆశ్చర్యపరుస్తారు. నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు పెడతారు. తగినంత లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఉన్నత హోదాలు ఊరిస్తాయి. రాజకీయవేత్తల కృషి కొంత ఫలిస్తుంది. వైద్యులు, కళాకారులకు దీర్ఘకాలిక సమస్య పరిష్కారం. 22,23 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సివస్తుంది. రాబడి నిరుత్సాహపరుస్తుంది. పనుల్లో అవరోధాలు. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.
మకరం… (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)
సమస్యలు కొన్ని పట్టుదలతో పరిష్కరించుకుంటారు. మీ తెలివితేటలు ప్రశంసలు పొందుతాయి. ఆప్తులు కూడా మీ మీసలహాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య మరింత సయోధ్య ఏర్పడుతుంది. భూవ్యవహారాలలో అవాంతరాలు తొలగి లబ్ధి చేకూరుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు, కొత్త భాగస్వాములతో చర్చలు. ఉద్యోగస్తులకు వివాదాలు సర్దుకుంటాయి. క్రీడాకారులు, రాజకీయవేత్తలు, ఐటీరంగంవారు కళాకారులు అవకాశాలు దక్కించుకుంటారు. 21,22 తేదీల్లో శ్రమ పెరుగుతుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. పనులు నత్తనడకన సాగుతాయి. దేవీస్తుతి మంచిది.
కుంభం… (ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ఆశించిన ఆదాయం సమకూరి అప్పులు తీరతాయి. మీ అభిప్రాయాలను ఉన్నది ఉన్నట్లుగా కుటుంబసభ్యులకు వివరిస్తారు. ఎంతటి కార్యక్రమాన్నైనా నేర్పుగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవర్తమానాలు. వివాహాది వేడుకలపై ఒక అంచనాకు వస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. స్వశక్తితో మరింత అభివృద్ది సాధిస్తారు. ఉద్యోగస్తులకు కొన్ని సమస్యలు తీరతాయి. క్రీడాకారులు వైద్యులు, పారిశ్రామికవేత్తల యత్నాలు ఫలిస్తాయి. 23,24 తేదీల్లో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదిస్తారు. కొన్ని వివాదాలు నెలకొని ఇబ్బందిపడతారు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
మీనం… (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర, రేవతి).
కొన్ని సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతాయి. సేవాభావాంతో కష్టాలలో ఉన్న వారిని ఆదుకుంటారు. విద్యార్థులు విజయాల కోసం యత్నిస్తారు. కోర్టు వ్యవహారాలలో పురోగతి. ఎంతటి కార్యాన్నైనా నేర్పుగా పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్యాలపై చర్చిస్తారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తొలగుతాయి. అనుకున్న ఆదాయం సకాలంలో సమకూరుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒక సమాచారం మరింత ఊరటనిస్తుంది. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు నూతనోత్సాహం. 20,21 తేదీల్లో ఇంటాబయటా ఒత్తిడులు. మానసిక ఆందోళన. దూరప్రయాణాలు. దేవీఖడ్గమాల పఠించండి.
––––––––––––––––––––––––––––––––