ముఖ్య పండగలు…
13వ తేదీ సోమవారం. భోగి పండగ.
14వ తేదీ మంగళవారం, మకరసంక్రాంతి, ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం.
15వ తేదీ బుధవారం, కనుమ పండగ.
17వ తేదీ శుక్రవారం, సంకటహర చతుర్ధి.
–––––––––––––––––––––––––––
మేషం…(అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)
మీపై వచ్చిన ఆరోపణలు లేదా విమర్శలను దీటుగా ఎదుర్కొంటారు. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. చాకచక్యంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వచ్చి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. సమావేశాలలో పాల్గొని మీ అభిప్రాయాలను వెల్లడిస్తారు. హఠాత్తుగా ఇతరుల నుంచి రావలసిన సొమ్ము అంది ఆశ్చరపడతారు. కుటుంబంలో సంతోషకరమైన పరిస్థితులు నెలకొంటాయి. కొన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయి. సోదరులు, సోదరీలతో విభేదాలు పరిష్కారం. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో మరింత అభివృద్ధి పరుస్తారు. ఉద్యోగాలలో పైస్థాయి నుండి తగినంత ప్రోత్సాహం. రాజకీయవేత్తలు, కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. 15,16 తేదీల్లో ఆరోగ్యం కాపాడుకోండి. వివాదాలకు దూరంగా ఉండాలి. శ్రమ పెరుగుతుంది. విష్ణుసహస్రనామ పారాయణచేయండి.
వృషభం…(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, వృగశిర 1,2 పాదాలు)
ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఆలోచనలపై ఎటూ తేల్చుకోలేరు. నిరుద్యోగులకు ఆశలు ఫలించవు. ఉద్యోగ యత్నాలలో విఘాతాలు. కాంట్రాక్టర్లకు మరింత ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇతరుల నుండి సొమ్ము తిరిగి రాకపోవడం ఇబ్బంది కలిగిస్తుంది. ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబంలో కొన్ని సమస్యలతో డీలాపడతారు. ఇళ్ల నిర్మాణాలు ఇంకా పూర్తి కాక నిరాశ చెందుతారు. వ్యాపారాలలో సామాన్యమైన లాభాలు ఉంటాయి. పెట్టుబడుల విషయంలో ఎటువంటి తొందరవద్దు. ఉద్యోగాలలో కొన్ని మార్పులకు అవకాశం ఉంది. విధుల్లో అప్రమత్తంగా మెలగాలి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనల్లో ఆటంకాలు. 14,15 తేదీలలో శుభవార్తలు వింటారు. ఆహ్వానాలు రాగలవు. ధనలబ్ది.. ఆదిత్య హదయం పఠించండి.
మిథునం..(మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు).
వారం విశేషమైనదిగానే చెప్పవచ్చు. విద్యార్థులు శక్తియుక్తులను చాటుకుంటారు. ఆలోచనలపై ఒక నిర్ణయానికి వస్తారు. వివాదాలు పరిష్కారమై ఊపిరిపీల్చుకుంటారు. ప్రముఖులతో చర్చలు జరుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సొమ్ము చేతికందే అవకాశాలున్నాయి. రుణదాతలు ఒత్తిడులు తగ్గిస్తారు. కుటుంబంలో ఆహ్లాదకర పరిస్థితులు ఉంటాయి. సోదరులు మీకు విశేషంగా సహకరిస్తారు. ఆరోగ్యసంరక్షణలో మీ జాగ్రత్తలు ఫలిస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. భాగస్వాములతో కొత్త ఒప్పందాలకు సిద్ధపడతారు. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం వింటారు. పారిశ్రామికవేత్తలు, వైద్యులకు మరింత అనుకూల పరిస్థితులు. 12,13 తేదీల్లో ప్రయాణ సూచనలు. అత్యంత ఆప్తులతో వివాదాలు. మానసిక ఆందోళన. శ్రీవారాహీ స్తోత్రాలు పఠించండి.
కర్కాటకం..(పునర్వసు 4వ పాదం, పుష్యణి, ఆశ్లేష).
అనూహ్యమైన రీతిలో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అందరిలోనూ మీరంటే ప్రత్యేక గౌరవం లభిస్తుంది. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఓర్పుతో క్లిష్టసమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులకు విద్యావకాశాలు పెరుగుతాయి. ఆదాయానికి కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీరతాయి. ఆరోగ్యసూత్రాలు పాటిస్తూ మరంత శ్రద్ధ తీసుకోవడం మంచిది. వారసత్వ ఆస్తుల విషయంలో ఒత్తిడులు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాల సందడి నెలకొంటుంది. సోదరులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. వ్యాపారాలలో అనుకున్నరీతిలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో మీ సామర్థ్యాన్ని చాటుకుంటారు. రాజకీయవేత్తలు, పరిశోధకుల ఆశలు నెరవేరే సమయం. కళాకారులు తమ నైపుణ్యతను చాటుకుంటారు. 16,17 తేదీలలో ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో చికాకులు. విశ్రాంతి అవసరం కావచ్చు. వృథా ఖర్చులు. విష్ణుధ్యానం చేయండి.
సింహం…(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు ఎట్టకేలకు కార్యరూపం దాలుస్తాయి. వ్యతిరేకులు మిత్రులుగా మారతారు. ఆస్తి వివాదాల నుంచి క్రమేపీ బయటపడతారు. చిన్ననాటి మిత్రులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. కుటుంబంలో అందరితోనూ అభిమానంతో మసలుకుంటారు. కొన్ని సమస్యలు తేలిగ్గా పరిష్కారం. ఆరోగ్యం క్రమేపీ మెరుగుపడుతుంది. వ్యాపారాలలో .ఊహించని విధంగా లాభాలు, తద్వారా కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు నూతనోత్సాహం. ఐటీ రంగం వారు, క్రీడాకారులకు మరింత అనుకూలమైన కాలం. 12,13 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని ఒప్పందాలు వాయిదావేస్తారు. శ్రమకు తగిన ఫలితం కష్టసాధ్యం. శివారాధన మంచిది.
కన్య…(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)
మీ ఆలోచనలు, వ్యూహాలు ఫలించే సమయం. ఆప్తులు, శ్రేయోభిలాషుల ప్రేమను పొందుతారు. వివాహ, ఉద్యోగయత్నాలను ముమ్మరం చేస్తారు. సమాజసేవపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని వారి సమస్యలు తెలుసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలు చేపట్టి భక్తివిశ్వాసాలను చాటుకుంటారు. ఆర్థికంగా మరింత ప్రోత్సాహకరమైన సమయం. సోదరుల నుంచి ధనలాభ సూచనలు. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు. అందరికీ ఆదర్శప్రాయులుగా నిలుస్తారు. ఆరోగ్యసమస్యలు తీరతాయి. వ్యాపారాలను అభివృద్ధిపర్చడంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో విధులను చక్కదిద్దడంలో ఆటంకాలు, చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు సంతోషకర సమాచారం. వైద్యులు, ఐటీ రంగం వారి ఆశలు నెరవేరతాయి. 15,16 తేదీల్లో బంధుగణంతో విభేదాలు. అనారోగ్యం. కుటుంబంలో కొత్త సమస్యలు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
తుల…(చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. ఉద్యోగాన్వేషణలో విజయం సంధిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. మిత్రులతో విభేదాలు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. రావలసిన సొమ్ము సమకూర్చుకుంటూ అప్పుల బాధల నుండి బయటపడతారు. కుటుంబంలోని అందరితోనూ సఖ్యతగా ఉంటారు. బంధువులు మీపై ప్రేమాభిమానాలు చూపుతారు. ఆరోగ్యపరంగా ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు కొత్త భాగస్వాముల చేయూత అందుతుంది. ఉద్యోగాలలో సంశయాలు తీరి విధులను సజావుగా పూర్తి చేస్తారు. కళాకారులు, వైద్యులకు పట్టిందల్లా బంగారమే. పారిశ్రామిక, రాజకీయవర్గాల యత్నాలు సఫలం కాగలవు. 12,13 తేదీల్లో దూరప్రయాణాలు. మనశ్శాంతి లోపిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. దేవీఖడ్గమాల పఠించండి.
వృశ్చికం…(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)
ముఖ్యమైన కార్యక్రమాలు మరింత సాఫీగా పూర్తి చేస్తారు. ఆలోచనలను ఎట్టకేలకు అమలులో పెడతారు.ు కార్యరూపం దాలుస్తాయి. చిరకాలంగా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను అతిచాకచక్యంగా పరిష్కరించుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులను శ్రమానంతరం దక్కించుకుంటారు. ఉద్యోగావకాశాల కోసం చేస్తున్న ప్రయత్నాలు సఫలం. కొన్ని ముఖ్య నిర్ణయాలకు సోదరుల సలహాలు తీసుకుంటారు. రావలసిన సొమ్ము అందుకోవడంలో సఫలమవుతారు. ఇతరులకు సైతం కొంత సహాయం అందిస్తారు. బంధువులు మీరంటే మరింత ఆదరణ, కరుణ చూపుతారు. ఇంట వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. దూరమైన వ్యక్తులు తిరిగి మీ చెంతకు చేరుకుంటారు. ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాల వైపు పయనిస్తారు. ఉద్యోగాలలో పైస్థాయి వారు మీ పనివిధానంపై సంతప్తి చెందుతారు. కళాకారులు, రాజకీయవేత్తలకు సంతోషకరంగా గడుస్తుంది. వైద్యులు, క్రీడాకారులకు ప్రోత్సాహకరమైన కాలం. 13,14 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులే శత్రువులు కాగలరు. ప్రతి నిర్ణయంపై నిదానం అవసరం. శివపంచాక్షరి పఠించండి.
ధనుస్సు…(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
దీర్ఘకాలిక సమస్యల నుండి ఎట్టకేలకు బయటపడతారు. సేవాభావంతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఒక వ్యక్తి ద్వారా రహస్య విషయాలు తెలుసుకుంటారు. చిరకాల మిత్రులను కలుసుకుని మీ అభిప్రాయాలను పంచుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పడిన ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు. కుటుంబంలో ఉల్లాసంగా గడుపుతారు. శుభకార్యాల సందడితో హడావిడిగా గడుపుతారు. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ వద్దు. వ్యాపారాలను విస్తరించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. మొత్తానికి లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో విమర్శల నుంచి బయటపడతారు. మీ సమర్థతను నిరూపించుకునే అవకాశం. రాజకీయవేత్తలు, క్రీడాకారుల సేవలకు తగినంత గుర్తింపు రాగలదు. ఐటీ రంగం వారు, వైద్యుల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. 16,17 తేదీల్లో వృథా ఖర్చులు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.
మకరం..(ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు).
క్రమేపీ అనుకూలత ఏర్పడి ఉత్సాహం పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు నెమ్మదించినా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆలోచనలపై ఒక నిర్ణయానికి వస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లు అనుకున్నది సాధిస్తారు. మీ పట్టుదల, సేవాభావం అందర్నీ ఆకట్టుకుంటాయి. ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు. ఆదాయానికి ఎటువంటి ఇబ్బందిలేకుండా అవసరాలు తీర్చుకుంటారు. కుటుంబంలోని అందరి అంగీకారంతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాల నిర్వహణపై ఆసక్తి చూపుతారు. బంధువుల రాక మరింత ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యపరంగా సమస్యలు తీరి మెరుగైన జీవనం సాగిస్తారు. వ్యాపారాలలో ప్రత్యర్థుల పోటీని తట్టుకుని లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో మంచి గుర్తింపు రాగలదు. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు మరిన్ని అవకాశాలు రాగలవు. వ్యవసాయదారులు, క్రీడాకారులకు తగిన హామీలు లభిస్తాయి. 17,18 తేదీల్లో దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. విలువైన డాక్యుమెంట్లు జాగ్రత్త. గణేశాష్టకం పఠించండి.
కుంభం….(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)
ముఖ్య కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారి పరిచయాలతో హుషారుగా గడుపుతారు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కోర్టు వ్యవహారాలలో రాజీమార్గం ఏర్పడవచ్చు. ఆస్తి వివాదాలు తీరి మీరు ఆశించిన లబ్ధి చేకూరుతుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. పెండింగ్∙బాకీలు వసూలవుతాయి. ఆరోగ్యంలో మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది. వ్యాపారాలలో రావలసిన పెట్టుబడులను సమకూర్చుకోవడంలో సఫలమవుతారు. విస్తరణ ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటారు. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలు సమర్థనీయంగా నిర్వహిస్తారు. క్రీడాకారులు, కళాకారులకు నూతనోత్సాహం. సత్కారాలు. వైద్యులు, ఐటీ రంగం వారి కృషి ఫలిస్తుంది. 12,13 తేదీలలో ఆకస్మిక ప్రయాణాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వివాదాలకు దూర ంగా ఉండండి. అంగారకస్తోత్రాలు పఠించండి.
మీనం…(పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరబాద్ర, రేవతి).
మీ శ్రమ ఎట్టకేలకు ఫలిస్తుంది. నూతనోత్సాహంతో కార్యక్రమాలు చక్కదిద్దుతారు. పరిచయాలు పెరిగి అందరితోనూ ఉత్సాహంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకాగలవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖుల నుంచి అందిన ఆహ్వానం మీలో కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. వాహనాలు, ఇల్లు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలబ్ధి. సోదరుల ద్వారా కొంత సహాయం అందుతుంది. కుటుంబసభ్యులతో ప్రేమాభిమానాలు పంచుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన మేర లాభాలు దక్కుతాయి. సంస్థల అభివృద్ధికి కొన్ని చర్యలు చేపడతారు. ఉద్యోగ విధి నిర్వహణలో సత్తా చాటుకుంటారు. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు. వ్యవసాయదారులు, వైద్యులకు మరింత కలసివచ్చే కాలం. 14,15 తేదీల్లో దూరప్రయాణాలు. కొన్ని కీలక చర్చలు విఫలం. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ధనవ్యయం. శివాష్టకం పఠించండి.