22.9 C
Hyderabad
Thursday, July 30, 2026

Live Video

spot_img

రాశిఫలాలు… 02.02.25 నుండి 08.02.25 వరకు

ఈవారం ముఖ్యమైన పండగలు-పర్వదినాలు…

3,సోమవారం, వసంత పంచమి.

4, మంగళవారం, రథసప్తమి.

5,బుధవారం, భీష్మాష్టమి.

8, శనివారం, భీష్మఏకాదశి.

మేషం…(అశ్వని, భరణి, కృత్తిక 1 పాదం)

కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. స్నేహితులతో  కష్టసుఖాలు పంచుకుంటారు. సోదరుల నుంచి  ముఖ్య సమాచారం అందుతుంది. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. కొన్ని సమస్యల నుంచి బయపడతారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఊహించని అవకాశాలు దక్కించుకుంటారు. తరచూ ప్రయాణాలు చేయాల్సివస్తుంది.   వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. దైవారాధనలో పాల్గొంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులతో విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు లభించే వీలుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులు యత్నాలు సఫలం. 3,4 తేదీల్లో కుటుంబంలో ఒత్తిళ్లు. అనారోగ్య సూచనలు. శ్రీకృష్టస్తోత్రాలు పఠించండి.

వృషభం…(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, వృగశిర 1,2 పాదాలు)

కొన్ని వివాదాలు చికాకు పర్చినా అయితే క్రమేపీ సద్దుకుంటాయి. ఆశ్చర్యకరమైనరీతిలో ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. ఆదాయానికి లోటు లేకున్నా ఖర్చులు కూడా పెరుగుతాయి. చేపట్టిన కార్యాలు ఎట్టకేలకు పూర్తి చేసి సమర్థతను చాటుకుంటారు. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. ఇంటి నిర్మాణయత్నాలలో స్వల్ప ఆటంకాలు.ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. బంధువులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. వ్యాపారులకు స్వల్ప లాభాలు దక్కుతాయి. విస్తరణ కార్యక్రమాలు నిదానిస్తాయి. ఉద్యోగులు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు.  కళాకారులు, పారిశ్రామికవేత్తలకులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. 7,8 తేదీలలో శుభవార్తలు. వాహనయోగం. గణపతి ఆరాధన చేయండి.

మిథునం..(మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)

నిరుద్యోగులకు అనూహ్యమైన అవకాశాలు దక్కే ఛాన్స్. చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. ఆశించినంత ఆదాయం సమకూరుతుంది. స్నేహితులు, సోదరులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆకస్మిక «ప్రయాణాలు సంభవం. ఆలోచనలు అమలు చేస్తారు. కొత్త వ్యక్తులు  పరిచయమవుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు మరింత అనుకూల సమయం. వాహనాలు, ఆభరణాలు కొంటారు.  వ్యాపారులకు శ్రమ ఫలించి లాభాల బాట పడతారు. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబ«ంధకాలు తొలగుతాయి. పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు,  కళాకారులకు నూతనోత్సాహం. 4,5 తేదీల్లో  అనుకోని ఖర్చులు. మానసిక అశాంతి. అంగారకస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం..(పునర్వసు 4 పాదం, పుష్యణి, ఆశ్లేష)

అప్రయత్న కార్యసిద్ధి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఊరటనిచ్చే సమాచారం అందుతుంది. బంధువులు, శ్రేయోభిలాషులతో  ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. రాబడి గతం కంటే మెరుగుపడుతుంది. కొన్ని సమస్యలు ఎట్టకేలకు పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టర్లకు మరింతగా లాభసాటిగా ఉంటుంది. గృహ నిర్మాణయత్నాలలో పురోగతి సాధిస్తారు. వ్యాపారులు అనుకున్న లాభాలు  ఆందుకుంటారు. ఉద్యోగులకు వి«ధి నిర్వహణలో మరింత అనుకూలస్థితి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలకు ఆకస్మిక విదేశీయానం.  2,3 తేదీల్లో  శారీరక రుగ్మతలు. స్నేహితులతో తగాదాలు. ఊహించని ప్రయాణాలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

సింహం…(మఖ, పుబ్బ, ఉత్తర 1 పాదం)

ముఖ్య కార్యక్రమాలను శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆదాయం గతం కంటే మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఆనందాన్ని పంచుకుంటారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వ్యతిరేకులను కూడా అనుకూలురుగా మార్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువుల ద్వారా ఆస్తిలాభ సూచనలు కనిపిస్తున్నాయి.  వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. వ్యాపారులు ఆశించిన లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ఊహించని అవకాశాలు దగ్గరకు వస్తాయి. 3,4 తేదీల్లో శారీరక రుగ్మతలు. స్నేహితులతో కలహాలు. దేవీస్తోత్రాలు పఠించండి.

కన్య…(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు)

రాబడి ఆశించినంతగా దక్కి అవసరాలు తీరతాయి. సన్నిహితులు, సోదరులతో విభేదాలు తొలగుతాయి.  కొన్ని వివాదాల నుంచి చాకచక్యంగా బయటపడతారు. మీకు అప్పగించిన పనులు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దేవాలయ దర్శనాలు. వేడుకలలో పాల్గొంటారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు  పదోన్నతులు దక్కే సూచనలు. రాజకీయవేత్తలు, కళాకారులు, క్రీడాకారులకు ఊహించని అవకాశాలు దక్కుతాయి. 5,6 తేదీల్లో దూరప్రయాణాలు. కుటుంబంలో కొన్ని సమస్యలు. ఖర్చులు పెరుగుతాయి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

తుల…(చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)

ప్రారంభంలో ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో మీకు ఎదురుండదు. రాబడి మరింత పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు.  భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు మరింత అనుకూలమైన సమయం. ఉద్యోగులకు విధి నిర్వహణలో మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరమైన సమయం. రచయితలు, క్రీడాకారుల ఆశలు ఫలిస్తాయి. 7,8తేదీల్లో శారీరక రుగ్మతలు. బంధువిరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆంజనేయ దండకం పఠించండి.

వృశ్చికం…(విశాఖ 4 పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

రాబడి మరింత పెరుగుతుంది. ముఖ్య కార్యక్రమాలలో అవాంతరాలు తొలగుతాయి. ప్రత్యర్థులు స్నేహితులుగా మారి సహకరిస్తారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. గతం గుర్తు చేసుకుంటారు.  వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు భాగస్వాముల నుంచి మరింత చేయూత.  ఉద్యోగులు విధుల్లో ప్రతిభ,  సత్తా నిరూపించుకుంటారు. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఇబ్బందుల నుంచి విముక్తి. పరిశోధకుల యత్నాలు ఫలిస్తాయి.2,3 తేదీల్లో అనుకోని ఖర్చులు. స్వల్ప అస్వస్థత. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు…(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పాదం)

వ్యూహాత్మకంగా సమస్యలు పరిష్కరించుకుంటారు. కొన్ని అవాంతరాలు అ«ధిగమించి అనుకున్న కార్యాలు చక్కదిద్దుతారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది.  సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దూరపు బం«ధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులు ఉత్సాహంగా ముందడుగు వేసి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఊహించని హోదాలు దక్కే సూచనలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు విదేశీ పర్యటనలు. రచయితలు,  క్రీడాకారులకు ఆహ్వానాలు అందుతాయి. 3,4 తేదీల్లో అనుకోని ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

మకరం..(ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)

ముఖ్య కార్యక్రమాలలో  అవాంతరాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధువులతో అకారణంగా వివాదాలు నెలకొనే అవకాశం. ఆలోచనలు అమలులో ముందడుగు వేస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆదాయం ఆశించినస్థాయిలో ఉంటుంది. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. దేవాలయాలు సందర్శిస్తారు.  మీ అంచనాలు కొన్ని నిజమవుతాయి.. వ్యాపారులకు ఉత్సాహవంతమైన కాలం. పెట్టుబడులకు తగిన లాభాలు అందుతాయి ఉద్యోగులకు విధి నిర్వహణలో సమస్యలు తీరతాయి. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు విశేష ఆదరణ లభిస్తుంది. రచయితలకు శుభవార్తలు. 5,6 తేదీల్లో  దుబారా వ్యయం. దూరప్రయాణాలు. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.

కుంభం….(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)

కొన్ని కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. బంధువర్గం మీతో విభేదించినా సహనంతో ముందుకు సాగుతారు. ఆదాయం కొంత తగ్గినా అవసరాలు తీరతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవర్తమానాలు అందుకుంటారు. శారీరక రుగ్మతలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. ఆస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వాహనసౌఖ్యం. కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు పెట్టుబడులు సమకూర్చుకుని ముందుకు సాగుతారు. ఉద్యోగులకు విధుల్లో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు  కార్యసిద్ధి. 4,5 తేదీల్లో  ఒప్పందాలు వాయిదా. కష్టానికి ఫలితం కనిపించదు.

మీనం…(పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరబాద్ర, రేవతి)

అనుకున్న ఆదాయం  సమకూరి అవసరాలు తీరతాయి. కుటుంబంలో ప్రత్యేక ఆదరణ లభిస్తుంది.  సన్నిహితులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. ధార్మిక  కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుంచి కొంత «ధనలబ్ధి కలుగుతుంది. ముఖ్య కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు సమకూర్చుకుని విస్తరణ కార్యక్రమాలు చేపడతారు. ఉద్యోగులకు హోదాలు మరింత పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. కళాకారులు, క్రీడాకారులకు నూతనోత్సాహం. 7,8 తేదీల్లో వృథా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. గణేశాష్టకం పఠించండి.

 

 

 

 

 

 

 

 

 

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com