34.2 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

హిట్ మ్యాన్.. హిట్ వికెట్‌ కాకుండా చూస్కో :గంగూలీ

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి మంచి జోష్ మీదున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. వన్డే, టీ20ల్లో టీమిండియా అదరగొడుతున్నా.. టెస్ట్‌ల్లోనే పరిస్థితి అస్సలు బాగాలేదంటున్నారు దాదా. పరిస్థితి మరింత చేజారకముందే అన్నింటికి చక్కదిద్దాలని సూచించాడు. నిజానికి రోహిత్ టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ప్రస్తుతం వన్డే, టెస్టులకు మాత్రం కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ ముగియగానే ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్ ఆడనుంది టీమిండియా. ఆ సమయంలో రోహిత్ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నాడు గంగూలీ.

గడచిన ఐదు నెలల్లో టీమిండియా మూడు టెస్ట్ సిరీస్‌లు ఆడింది. ఇందులో రెండింటిలో దారుణంగా ఓడింది. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో పది టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడితే మూడింటిలో మాత్రమే గెలిచింది. రోహిత్ కెప్టెన్సీలో చరిత్రలో మొదటిసారి WTC ఛాంపియన్స్ ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది టీమిండియా.

ఈ విషయాలను గమనించే గంగూలీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు అర్థమవుతుంది. నిజానికి రోహిత్ బాగా ఆడగలడు.. కానీ నాలుగైదు ఏళ్లుగా టెస్ట్‌ల్లో విఫలమవుతున్నాడు రోహిత్. అందుకే అతని ఫామ్‌ చూసి ఆశ్చర్యపోయాను అంటున్నాడు దాదా. అందుకే రోహత్ ఈ విషయంపై ఫోకస్ చేసి.. రాబోయే ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో బాగా ఆడాలి. ఇంగ్లండ్‌ గడ్డపై టెస్ట్‌ సిరీస్‌ అంటే మాములు విషయం కాదు.. ఈ మ్యాచ్‌లో ఇండియాను గెలుపు బాటలో నడిపించడం కాదు.. అతను కూడా తన ఆటను మెరుగుపరుచుకోవాలి అంటున్నాడు దాదా.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com