32.6 C
Hyderabad
Tuesday, June 16, 2026

Live Video

spot_img

పక్షుల గుంపును ఢీకొని.. ఆపై కిందకు జారిపోయి…

67మందితో కుప్పకూలిన అజెర్ బైజాన్ విమానం

కజకస్తాన్లో విమానం కుప్పకూలిన ఘటనకు పక్షుల గుంపును ఢీకొనడమే కారణమని తెలుస్తోంది. విమానంలో ప్రమాద సమయానికి కేబిన్ క్రూలో ఐదుగురు సిబ్బందితో కలపి 67 మంది ప్రయాణికులు ఉన్నారు.ప్రమాదం తర్వాత 28 మంది ప్రాణాలతో బయటపడ్డారు..వీరిలో 11 ఏళ్ల బాలిక కూడా ఉంది. గాయాలపాైలన 22 మందిని ఆస్పత్రి కి తరలించారు.వారిలో ఐదుగురి పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో ఐసీయూకి తరలించారు. ఎంబ్రార్ 190అనే ఈ విమానం అజర్ బైజాన్ రాజధాని బాకు నుంచి రష్యాలోని చెచెన్యాలో గ్రోజ్నీ కి వెళుతోంది. గ్రోజ్నీలో దట్టమైన మంచు కారణంగా ఈ విమానాన్ని మళ్లీ అక్టౌ సిటీలోని బాకు కే మళ్లించారు.

ప్రమాదం జరిగిందిలా..

విమానం గాలిలో ఉండగానే పక్షుల గుంపును ఢీకొందని దాంతో సిగ్నల్స్ ఫెయిల్ అయ్యాయని, అంతలో స్టీరింగ్ కూడా అదుపుతప్పిందని కజక్ విమాన యాన సంస్థ తెలిపింది.
ల్యాండింగ్ సమయంలో విమానం అత్యంత వేగంగా కిందకు జారి కుడివైపుకు తిరిగి నేలను బలంగా ఢీకొంది. దాంతో మంటలు రేగాయి. చాలాసేపు గాలిలో చక్కర్లు కొడుతున్న ఆ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ కు అనుమతించాలని పైలట్ రిపీటెడ్ గా విజ్నప్తి చేస్తుండగానే విమానం కిందకు జారిపోయింది. కిందకు జారిపోతున్న విమానాన్ని పైలట్ మళ్లీ పైకి ఎగరేలా చేసేందుకు గంటన్నర పాటు శక్తి వంచన లేకుండా శ్రమించాడు. కొంత దూరం పైకి వెళ్లిన విమానం అక్కడే మొరాయించింది.ల్యాండింగ్ కోసం గాల్లోనే చక్కర్లుకొట్టి చివరకు అదుపుతప్పి కిందకు పడిపోయింది. జీపీఎస్ జామ్ అయిపోడం వల్లనే ప్రమాదం జరిగిందని డాటాను విశ్లేషించిన ఫ్లైట్ రాడార్24 విశ్లేషించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com