27 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

ఉక్రెయిన్, అమెరికా మధ్య చరిత్రాత్మక ఒప్పందం !!

  • ఉక్రెయిన్లో ఖనిజ నిక్షేపాలు ఇవ్వాలని ఒప్పందం
  • యుద్ధ సహాయం చేసేందుకు అమెరికా షరతు
  • ఉక్రెయిన్ లో కీలక ఖనిజ వనరులపై ట్రంప్ కన్ను
  • ఆయుధ సంపత్తి, మిలటరీ సాయానికి కండిషన్
  • ఖనిజ వనరులు కట్టబెట్టేందుకు సై అన్న ఉక్రెయిన్
  • యుద్ధం ఇప్పట్లో ఆగేది కాదంటూ రష్యా సంకేతం
  • శాంతి చర్చలతో యుద్ధం ఆపేస్తానని ట్రంప్ బీరాలు
  • ఉక్రెయిన్ భూభాగం ఐదో వంతు ఇప్పటికే రష్యా స్వాధీనం

రష్యాతో మూడేళ్లుగా యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్ దీనికోసం పెద్దన్నఅమెరికా సాయం, నైతిక మద్దతు కోరింది. అయితే దీనికి కండిషన్ గా ఉక్రెయిన్లో అపారంగా ఉన్న ఖనిజ వనరులను తమకు అప్పగించాలని అమెరికా షరతు విధించడంతో తలొగ్గిన ఉక్రెయిన్ అందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకం చేయడానికి సిద్ధపడింది. ఉక్రెయిన్ ఆర్ధిక మంత్రి యులియా సిరిడెంకో ఈ ఒప్పందానికి అవసరమైన సాంకేతిక వివరాలతో కూడిన అగ్రిమెంట్ రూపకల్పనకు వాషింగ్టన్ వచ్చారు.

ఈ ఒప్పందం సమాచారం ఉక్రెయిన్ బయటకు వెల్లడించేందుకు ఇష్టపడనప్పటికీ పేరు చెప్పడానికి ఇష్టపడని ఉక్రెయిన్ అధికారులే దీనిని ధృవీకరించారు. రెండు దేశాల మధ్య ఇదొక చరిత్రాత్మక ఒప్పందంగా నిలుస్తుందని చెబుతున్నారు.అయితే ట్రంప్ ఈ ఒప్పందంపై సంతకం చేస్తారా లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు.

అపార ఖనిజ వనరుల గని…

ఉక్రెయిన్లో అత్యంత అరుదైన ఖనిజవనరులు ఎన్నో ఉన్నాయి. టైటానియం, లిథియం, యురేనియం, మాంగనీస్, గ్రాఫైట్ ఇలా ఎన్నో నిక్షేపాలు అపారంగా ఉన్నాయి.వీటిలో ముఖ్యమైన ఖనిజాల్లో టిటానియం ఒకటి. విమానాల రెక్కలు, ఇతర విడిభాగాల తయారీలో టిటానియంను వాడతారు. అలాగే బ్యాటరీ టెక్నాలజీకి లిథియం ఖనిజం అవసరం పడుతుంది. ఇక యురేనియం ను అణు శక్తి తయారీకి, ఆయుధాల తయారీకి, వైద్య పరికరాల తయారీకి వినియోగిస్తారు.ఇవి కాక గ్రాఫైట్, మాంగనీసులను ఈ-వాహనాలలో బ్యాటరీల తయారీకి వినియోగిస్తారు.ఈ నిక్షేపాలపై ఎప్పుడో కన్నేసిన అమెరికా అప్పటినుంచి ఉక్రెయిన్ ను దారికి తెచ్చుకోవాలని చూస్తోంది.ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు దేశాల మధ్య ఈ ఖనిజాల అప్పగింతపై చర్చలు విఫలమయ్యాయి. అమెరికా నుంచి మరింత మిలటరీ సాయం, ఆయుధ సంపత్తిని పొందేందుకు ఈ ఒప్పందం కీలకం కాగలదని ఉక్రెయిన్ భావిస్తోంది. అయితే ఈ ఒప్పందంపై సంతకాలకు ముందు ఒప్పంద పత్రాలు, అందులో షరతులు తమకు చూపాలన్నది ఉక్రెయిన్ పట్టు. ఆ తర్వాతే ఉక్రెయిన్ ప్రభుత్వ ప్రతినిధి దీనిపై సంతకం చేసే అవకాశముంది. ఆతర్వాత ఈ ఒప్పందాన్ని ఉక్రెయిన్ పార్లమెంటులో రాటిఫై చేశాక అమలు అవుతుంది.

ఉక్రెయిన్ అధికారుల సమాచారం ప్రకారం ఈ ఒప్పందం చాలా చాలా  కీలకమైనది. ఇందులో ప్రధానమైన ఒప్పందంతో పాటు, మరిన్ని కీలక పత్రాలు, రెండు సాంకేతిక ఒప్పందాలు ఇమిడి ఉన్నాయి. రెండు దేశాల జాయింట్ ఫండ్ ఆపరేషన్, ఇతర విధి విధానాలు అందులో ఉంటాయి. అయితే ఇప్పటికే ఈ ఒప్పందం నమూనాను పరిశీలించిన ఉక్రెయిన్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.

యుద్ధం ఆగడమా? అంత సులభం కాదు

మరోవైపు రెండుదేశాల మధ్య యుద్ధం ఆపడం అనేది చాలా సంక్లిష్టమైన వ్యవహారమని అది ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని మాస్కో అధికారుల అభిప్రాయం.ఇదిలా ఉండగా రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ పై రాత్రి వేళ ద్రోణ్ లతో రష్యా దాడి చేయడంతో ఖెర్కెవ్ పట్టణంలో 45 మంది పౌరులకు గాయాలయ్యాయి.

అసహనంలో అమెరికా

రెండు దేశాల మధ్య యుద్ధం ఆపడానికి అమెరికా ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది.తాను అధికారంలోకి వచ్చిన 24గంటల్లో రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ ప్రకటించారు. కానీ ఇన్ని నెలలైనా పరిస్థితి కొలిక్కి రాకపోగా, ఇంకా కొనసాగుతూనే ఉండటం పట్ల ట్రంప్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. మూడున్నరేళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో రష్యా ఇప్పటికే ఉక్రెయిన్ కు చెందిన ఐదో వంతు భూమిని స్వాధీనం చేసుకుంది. శాంతి చర్చల దూకుడు పెంచి  రెండు దేశాలు వేగంగా సమస్య పరిష్కరించుకుని యుద్ధానికి గుడ్ బై చెప్పాలని అమెరికా పట్టుబడుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com