మలయాళి కుట్టి మాళవిక మోహనన్ 1993లో జన్మించింది. పట్టంపోల్ మలయాళి సినిమా ద్వారా 2013లో సినీ రంగంలోకి అడుగుపెట్టిన మాళవిక తమిళ, కన్నడ, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తోంది. సినిమాలతో పాటు వివిధ బ్రాండ్లకు యాడ్స్ చేస్తూ..ఫ్యాషన్ షోల్లో హంగామా చేస్తుంది. తాజాగా హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కేరళలోని కన్నూరుకు చెందిన మాళవిక విద్యాబ్యాసం అంతా ముంబైలో సాగింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె. యు. మోహనన్ కుమార్తె మాళవిక మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసింది.
తెలుగులో ప్రభాస్ సరసన ది రాజా సాబ్ సినిమాలో చేస్తోన్న మాళవిక మలయాళంలో మోహన్ లాల్ సినిమాలో కూడా చాన్స్ కొట్టేసింది. ది రాజా సాబ్ సినిమా షూటింగ్ జరుగుతోంది.
రాజా సాబ్ తో తెలుగు వారికి పరిచయం అవుతున్న మాళవిక ఆ సినిమాలో చేసిన కొన్ని సన్నివేశాల వీడియాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమా ఏప్రిల్ చివరలో విడుదల కానుంది.
మాళవిక మలయాళి అమ్మడు అయినా ముంబైలో పెరగటంతో అక్కడి ప్రభావం అధికంగా ఉంటుంది. హిందీలో బియాండ్ ద క్లౌడ్స్ సినిమా చేసింది.
సన్నని నడుముతో నాజుకుగా ఉండే మాళవిక రాజా సాబ్ తో తెలుగులో మరింత బిజీ కానుందని అప్పుడే టాక్ మొదలైంది. మాళవిక రోమాంటిక్ లుక్స్ వీక్షకులను ఆకట్టుకుంటోంది.
courtesy: instagram