22 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

బీసీసీఐ ప్రక్షాళన మొదలుపెట్టిందా?

BCCI కీలక నిర్ణయం తీసుకుంది. కీలకం అనేకంటే షాకింగ్ అని చెప్పడం కరెక్ట్. ఎందుకంటే టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్‌, స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌ సోహమ్‌ దేశాయ్‌ను వారి పదవుల నుంచి తప్పించింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎఫెక్ట్‌ కారణంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ విషయంపై బీసీసీఐ అధికారికంగా స్పందించలేదు. కానీ ఈ ప్రక్షాళన జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ ముగియగానే.. ఇంగ్లండ్‌తో భారత్ టెస్ట్‌ సిరీస్ ఆడనుంది. ఇలాంటి సమయంలో ఈ మార్పులు చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటాయనే చెప్పాలి.

అసిస్టెంట్‌ కోచ్‌గా ఉన్న అభిషేక్‌ నాయర్‌కు బీసీసీఐ ఎనిమిది నెలల కిందటే నియమించింది. 2024 టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత రాహుల్‌ ద్రవిడ్‌ పదవీకాలం ముగిసింది. దీంతో బీసీసీఐ గంభీర్‌ను హెడ్‌కోచ్‌గా నియమించింది. అప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు గంభీర్‌ మెంటార్‌గా వ్యవహరించాడు. ఆ టీమ్‌లో పని చేసిన అభిషేక్‌ నాయర్‌, ర్యాన్‌ టెన్‌ డోస్చాట్‌ను గంభీర్‌ సపోర్టింగ్‌ స్టాఫ్‌గా తీసుకున్నాడు. మోర్నే మోర్కెల్ లక్నో సూపర్ జెయింట్స్‌లో గంభీర్‌తో కలిసి పనిచేశాడు. ద్రవిడ్ పదవీకాలం నుంచి దిలీప్‌ ఫీల్డింగ్‌ కోచ్‌గా పని చేస్తూ వచ్చాడు.

స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్ టెస్ట్‌ సిరీస్‌ను క్వీన్‌ స్వీప్‌ చేసుకునిపోయింది. ఇక BGTలో అయితే 1-3 తేడాతో ఓడింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఘోర పరాజయం తర్వాత అభిషేక్‌ పనితీరుపై ప్రశ్నలు తలెత్తాయి. దీంతో టీమిండియా ఏ కోచ్‌ సితాన్షు కొటక్‌ను బీసీసీఐ బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించింది. ఆ తర్వాత టీమిండియా చాంపియన్స్‌ ట్రోఫీని గెలిచింది. ఆ సమయంలోనూ అభిషేక్, ర్యాన్ టెన్, మోర్కెల్, దిలీప్ కూడా జట్టు సిబ్బందిగా కొనసాగారు. ప్రస్తుతం అభిషేక్‌, దిలీప్‌, సోహంను తొలగించగా.. మిగతా వారు కొనసాగనున్నారు. ప్రస్తుతానికి, టి దిలీప్ స్థానంలో అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ తాత్కాలికంగా ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలను నిర్వర్తించనున్నాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com