సిడ్నీ టెస్ట్‌లో రోహిత్ శర్మ ఆడలేదు. ఫామ్ సరిగా లేదని టీమ్ మెనేజ్‌మెంట్ పద్దతిగా అతడిని పక్కన పెట్టేసింది. టీమ్ పగ్గాలు టీమ్ ఇండియా పేస్ అటాక్ లీడ్ చేస్తున్న జస్ప్రీత్ బుమ్రాకు అందాయి. దీంతో ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. రోహిత్ శర్మ తన టెస్ట్ ఆటకు ఎండ్ కార్డ్ చెప్పేశాడా అని. నిజానికి కొంతమంది టీమ్ కోసం త్యాగం చేశాడని చెబుతున్నా.. ఇకపై రోహిత్ మ్యాచ్ ఆడే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమ్ ఇండియా జూన్‌లో WTC ఫైనల్స్ ఆడుతుంది. అప్పటి వరకు టెస్ట్ మ్యాచ్ ఆడేది లేదు. అందుకే రోహిత్ ఇక టెస్ట్‌లకు వీడ్కోలు పలకబోతున్నాడన్న ప్రచారానికి బలం చేకూరింది.
టీమ్ ఇండియా అత్యంత ముఖ్యమైన ప్లేయర్స్‌లో రోహిత్ శర్మ ఒకడు. కానీ అదంతా గతం అనిపించేలా ప్రస్తుతం అతని పర్ఫామెన్స్ ఉంది. రన్స్ స్కోర్ చేయడంలో వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. లాస్ట్ 15 ఇన్నింగ్స్‌లో అతను చేసింది కేవలం 164 రన్స్ మాత్రమే. ఇందులో ఒకటంటే ఒకటే హాఫ్ సెంచరీ ఉంది. ఇందులో అతని స్కోరు ఎనిమిది సార్లు సింగిల్ డిజిట్ దాటలేదు. రోహిత్ రిటైర్మెంట్ ప్రచారం నిజమైతే అతను ఆడిన చివరి టెస్ట్ మెల్‌బోర్నే అని చెప్పాలి. ఇందులో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 3, సెకండ్ ఇన్నింగ్స్‌లో 9 పరుగులు మాత్రమే చేశాడు రోహిత్.
రోహిత్ నిజంగానే రిటైర్మెంట్ ప్రకటిస్తే.. ఇది అవమానకరమైన ఎగ్జిట్ అనే చెప్పాలి. ఎందుకంటే తన చివరి మ్యాచ్ ఘనంగా ముగించలేకపోయాడు. అతడికి ఏ గాయం కాలేదు.. మరే సమస్య లేదు.. కానీ అతడిని టీమ్ మెనేజ్‌మెంట్ పక్కన పెట్టేసింది. ఇక నీ ఆట చాలు బాబు… అంటూ అతడిని పక్కన పెట్టింది టీమ్ మేనేజ్‌మెంట్. అంతేకాదు ఓ కెప్టెన్‌ని సరిగా ఆడటం లేదని పక్కన పెట్టడం టీమ్ ఇండియా హిస్టరీలో ఇదే తొలిసారి అని చెప్పాలి. అతను కనుక రిటైర్మెంట్ ప్రకటిస్తే సెండ్ ఆఫ్ మ్యాచ్ లేకుండానే అతను ఆటకు అల్విదా పలికినవాడవుతాడు.
ప్రస్తుతం క్రికెట్ దిగ్గజాలు కూడా రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై స్పందిస్తున్నారు. ఇలాంటి సమయంలో అతను ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ఆశ్చర్యం అవసరం లేదంటున్నాడు టీమ్ ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రీ. అంతేకాదు తన ఆటను రివ్యూ చేసుకొని ఆడకుండా బెంచ్‌పై కూర్చోవడానికి చాలా ధైర్యం కావాలని.. రోహిత్ అది చేసి చూపించాడంటూ ప్రశంసలు కురిపించాడు. అంతేకాదు రిటైర్మెంట్ వార్తలపై స్పందించిన రవిశాస్త్రీ.. రోహిత్ ఏం చిన్నపిల్లాడు కాదన్నాడు. సో.. రోహిత్ రిటైర్మెంట్ అనౌన్స్‌మెంట్‌కు మూడ్ సెట్ అవుతుందనే చెప్పాలి.
రోహిత్ శర్మ సారధ్యంలో టీమిండియా టెస్ట్ క్రికెట్ కాస్త డౌన్‌ఫాల్‌ను చూసిందనే చెప్పాలి. రోహిత్ కెప్టెన్సీలో మొత్తం 24 టెస్టులు ఆడగా.. అందులో 12 మ్యాచ్‌ల్లో గెలవగా.. తొమ్మిది టెస్ట్‌ల్లో ఓడిపోయింది. మూడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. అతని కెప్టెన్సీలో ఇండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 ఫైనల్‌లో కూడా ఆడింది. అప్పుడు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో టీమిండియా వైట్ వాష్ అవ్వడం రోహిత్ టెస్ట్ కెరీర్‌లో ఓ మాయని మచ్చ అనే చెప్పాలి. ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోవాలనుకున్నా అది అయ్యే పనిలా కనిపించడం లేదు. రోహిత్ లేని పెర్త్ టెస్ట్‌లో టీమిండియా విజయం సాధించగా.. ఆ తర్వాత జరిగిన మూడు టెస్టుల్లో ఒక టెస్ట్ మ్యాచ్ డ్రాకాగా.. రెండింటిలో ఓడిపోయింది. ఇవన్నీ కూడా రోహిత్ కెప్టెన్సీపై అనేక విమర్శలకు కారణమయ్యాయి.