36.2 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

చేతులకు బేడీలు.. కాళ్లకు సంకెళ్లు…

  • అక్రమ వలసదారులపై అమానుష వైఖరి
  • ప్రపంచ దేశాలకు ఇది వార్నింగ్‌ అన్న ట్రంప్‌
  • డిపోర్టీల వీడియోను రిలీజ్ చేసిన అమెరికా
  • పెద్ద ఎత్తున విరుచుకుపడిన విపక్షాలు
  • మరీ ఇంత దారుణమా అన్న మమత
  • సంప్రదింపులు జరిపామని చెప్పిన జయశంకర్

అమెరికా అక్రమ వలస దారులను తిప్పి పంపడంలో అమెరికా తనఅమానుష పంథా మార్చుకోవడం లేదు.. వారిని వారి వారి దేశాలకు యుద్ధవిమానాల్లో సాగనంపే క్రమంలో విమానం ఎక్కించేముందు కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి కార్గో సరుకును ఎత్తిపడేసినట్లు అక్రమ వలసదారులను విమానంలోకి విసిరేస్తోంది. అయితే ఈద్ధతిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిపై మన విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ స్పందించారు. భారత అక్రమ వలసదారులను తిప్పి పంపే టప్పుడు వారిని అవమానించ వద్దని, అగౌరవంగా పంపొద్దని వైట్‌ హౌస్ వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.ఆ తర్వాతే వారిని విసిరేయకుండా పద్ధతిగా విమానం ఎక్కిస్తోందన్నారు.

భారత్ విన్నపాన్ని లెక్క చేయని అమెరికా

భారత ఇమ్మిగ్రంట్లను ట్రీట్ చేస్తున్న విధానంపై కేంద్రం స్పందించడం లేదని ఇప్పటికే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈనేపధ్యంలో జయశంకర్ వైట్‌ హౌస్ వర్గాలతోసంప్రదింపులు జరిపారు. కానీ అమెరికా తీరు మాత్రం మార్చుకోలేదు. అక్రమ వలసదారులను ఇలాగే వెనక్కి పంపాలి.అది వారికి మేమిచ్చే ట్రీట్‌ మెంట్‌ అన్న ధోరణిలోనే అమెరికా అడుగు ముందుకేస్తోంది. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హమీ మేరకే ఈ అక్రమ వలసదారుల ఏరివేత కార్యక్రమం సాగుతోంది.

ఈనేపధ్యంలోనే ఏలియన్ డిపోర్టేషన్ ఫ్లైట్‌లో ఓ అధికారి అక్రమ వలసదారులకు చేతులకు బేడీలు కాళ్లకు సంకెళ్లు వేస్తున్న 41 సెకన్ల నిడివి కలిగిన వీడియో బయటకొచ్చింది.. ఆవీడియోలో ఎయిర్ పోర్టు టర్మాక్ పై సంకెళ్లు, బేడీలు కూడా కనిపించాయి.ఓ అధికారి అందులోంచి సంకెళ్లు, బేడీలను బయటకు తీసి డిపోర్టీల చేతులకు వేస్తున్న దృశ్యాలు ఉన్నాయి.డిపోర్టీ ఫేస్ కనిపించలేదు. కానీ ఆ అధికారితో కలసి డిపోర్టీ ఇబ్బందిగా నడుచుకుంటూ విమానం ఎక్కుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. విమానం ఎక్కేందుకు నడుస్తున్న మరో డిపోర్టీ కాళ్లకున్న సంకెళ్లను కూడా క్లోజ్ అప్ షాట్‌లో చూపారు.

సోషల్‌ మీడియాకు వీడియో రిలీజ్

అమెరికా ఇప్పటి వరకూ 300 మంది అక్రమ వలసదారులను భారత్ కు తిప్పిపంపింది.అమెరికా బోర్డర్ సెక్యూరిటీ చీఫ్‌ మైఖేల్‌ బాంక్స్ ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్ చేశారు.దీనిపై భారత్ లో పెద్ద ఎత్తున దుమారం రేగింది.విపక్షాలు ప్రభుత్వ నిస్సహాయతను దుమ్మెత్తి పోస్తున్నాయి.

మనవాళ్లను మనమే తెచ్చుకోలేమా?

తృణమూల్ అధినేతి మమతా బెనర్జీ డిపోర్టీలను సాగనంపే తీరు అదేనా? అసలు మనదేశమే విమానాలు పంపి మన వాళ్లను వెనక్కి తెస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.మోడీ అమెరికా అధికారిక పర్యటనలో ఉండగానే డిపోర్టీలను వెనక్కు పంపారు. అప్పుడైనా మావాళ్లని గౌరవంగా మేం వెనక్కు తెచ్చుకుంటాం అని మోడీ ట్రంప్ కు స్పష్టం చేసి ఉండాల్సింది. ఈ అనైతిక పద్ధతిపై నిరసన వ్యక్తం చేసి ఉండాల్సిందని అన్నారు.దీనిపై విదేశాంగ మంత్రి జయశంకర్ రాజ్యసభలో స్పందించారు. అక్రమ వలసవాదులను తిప్పి పంపడం అనే ఈ ప్రక్రియ ఈ, సంప్రదాయం ఎప్పటినుంచో అమల్లో ఉంది. అక్కడి ఇమ్మిగ్రేషన్, అండ్‌ కస్టమ్స్ ఎన్‌ ఫోర్సుమెంట్ అథారిటీ ఈ పనిచేస్తుంది. ఈ పద్ధతి 2012నుంచే కొనసాగుతోంది.కనీసం మహిళలు, పిల్లల విషయంలోనైనా కొంచెం లిబరల్ గా ఉండమని అమెరికాను కోరామని అన్నారు.మన విమానాలు పంపుతామంటే అమెరికా వద్దని చెప్పిందన్నారు. దీన్ని బట్టి ట్రంప్‌ అక్రమ వలసదారులను ఇలాంటి ట్రీట్‌ మెంట్‌ తోనే సాగనంపాలని నిర్ణయించుకున్నట్లు అర్ధమవుతోంది.

ట్రంప్‌ అనుకుంటే జరగాల్సిందే…

అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద డిపోర్టేషన్‌ ఆపరేషన్ గా నిలవనుంది. ట్రంప్‌ ఎన్నికల హామీ కావడంతో అది అందరికీ తెలిసేలా యుద్ధవిమానాల్లో వారిని తరలిస్తున్నారు. ఈ తరలింపు ప్రక్రియకు భారీగా డబ్బు కర్చవుతోంది. యుద్ధవిమానాలలో తరలింపు విమానఖర్చులు మామూలు విమానాల ఖర్చులతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ.ఈ తరలింపు ద్వారా ట్రంప్ యావత్‌ ప్రపంచానికి ఓ రాజకీయ సందేశాన్నిచ్చినట్లయ్యింది. ఇటీవల మన వలసదారులను పంపిన యుద్ధవిమానం ట్రాన్స్ పోర్టు ఖర్చు అక్షరాలా పది లక్షల రూపాయలు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com