- ఏఐ, జనరల్ ఏఐ సేవల వినియోగం పెంపు
- ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటున్నఅనేక కంపెనీలు
- టాటా, టీసీఎస్ లలో 40 శాతం ట్రైనీస్ కు అవకాశం
- ఐటీ, జనరల్ ఐటీ సర్వీసులపై అన్ని కంపెనీల కసరత్తు
- యూజర్ ఫ్రెండ్లీ సర్వీసుల కోసం ఐటీ కంపెనీల ఆరాటం
ఐటి సెక్టర్‌లో ఏఐ స్కిల్స్ అనివార్యత రాను రాను పెరుగుతోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసులు, టీసీఎస్ లాంటి కంపెనీలు హై ఎండ్ స్కిల్స్(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్‌తో పాటు) కలిగిన ఉద్యోగులనే రిక్రూట్ చేసుకుంటున్నాయి.ఈ స్కిల్స్ కలిగిన ఉద్యోగులనే తీసుకుంటున్నామని టీసీఎస్ కంపెనీ చీఫ్ హెచ్ ఆర్ అధికారి మిలింద్ లక్కాడ్ తెలిపారు. తాము గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 40 శాతం ట్రైనీస్‌ని తీసుకున్నామని అన్నారు. గత ఏడాది తమ ఉద్యోగుల రిక్రూట్ మెంట్ కేవలం 17 శాతంగా ఉందని తేల్చారు.
కంపెనీ ఫోర్త్ క్వార్టర్‌లో డాటా ఇతర ఎఐ రిలేటెడ్ వర్క్ కల్చర్ పెరిగిందని అన్నారు. ఎఐ, జనరల్ ఏఐ, డాటా, క్లౌడ్ సర్వీస్, ఇతర ఎంటర్ ప్రైజ్ సొల్యూషన్స్‌లలో క్లైంట్ ఎంగేజ్ మెంట్ పెరిగిందని ఇది కంపెనీ అభివృద్ధికి ఒక సంకేతమని అన్నారు.
గత ఏడాది క్వార్టర్‌తో పోలిస్తే ఏఐ, జనరల్ ఏఐ ఎంగేజ్‌మెంట్ బాగా పెరిగిందని ఐటీ సర్వీసులు, ఇతర ఆర్టిఫీషియల్‌సేవల ప్రాధాన్యత తమ కంపెనీలలో బాగా పెరిగిందని టీసీఎస్ సిఈఓ కె.కృత్తివాసన్ అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో క్లౌడ్ మార్కెట్ విపరీతంగా పెరిగిందని, అందువల్ల ఆ కేటగిరీలో ఏఐ సేవల అనివార్యత పెరిగిందని డిజిటల్ ఏఐ సేవల విభాగాలను ఆధునీకరించి, అవసరాలకు అనుగుణంగా అప్ డేట్ చేయాల్సిన అవసరం పడుతోందని అన్నారు.
డాటా ఆధునీకరణ ఏఐ, జనరల్ ఏఐ సర్వీసుల వినియోగం పెరిగి కంపెనీ బిజినెస్ యాక్టివిటీ పెరుగుతోందని కృత్తి వాసన్ అన్నారు. కాంట్రాక్టు మేనేజ్ మెంట్లు, సేల్స్ కాంపెయిన్, కంటెంట్ క్రియేషన్ విభాగాల్లో జనరల్ ఏఐ సేవల డిమాండ్ పెరిగిందన్నారు. సంస్థాగతంగా ఈ సేవలు అందచేయడంలో ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోతున్నాయని అన్నారు.
విప్రో, ఇన్ఫోసిస్, ఎల్‌టీఐ మైండ్ ట్రీ,హెచ్ సీఎల్ టెక్నాలజీస్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఏఐ సర్వీసులలో నైపుణ్యాన్ని పెంచుతున్నాయి.హెచ్ డి ఎఫ్ సీ సెక్యూరిటీస్ సంస్థ తమ ఐటీ సెక్టర్ లో వ్యాపార లావాదేవీలన్నీ అతి తక్కువ ప్రోసెస్,తక్కువ వ్యయంతో సేవలందేలా డిజైన్ చేసుకుంటోంది.
ఐటీ కంపెనీలు జనరల్ ఏఐని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాయి. న్యూటానిక్స్ కంపెనీ తమ 52 శాతం ఉద్యోగులకు ఐటీట్రైనింగ్ అందిస్తోంది. మరో 48 శాతం కొత్త వారిని జనరల్ ఏఐ సేవల కోసం రిక్రూట్ చేసుకోవాలని భావిస్తోంది.