23 C
Hyderabad
Wednesday, October 28, 2026

Live Video

spot_img

స్టార్టప్‌లకు బడ్జెట్‌లో గుడ్‌ న్యూస్‌ – రుణాలు భారీగా పెంచుతూ నిర్ణయం

కేంద్ర బడ్జెట్‌లో ఈ సారి స్టార్టప్‌లకు గుడ్‌ న్యూస్‌ చెప్పారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ నిర్మల చేసిన బడ్జెట్‌ ప్రసంగంలో స్టార్టప్‌ కంపెనీలకు పలు వరాలు ప్రకటించారు. సమ్మిళిత అభివృద్ధి కోసం.. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ఈ యేడాది బడ్జెట్ ఉంటుంద‌ని ఆర్థిక మంత్రి నిర్మలా తెలిపారు. అటు.. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినప్పటికీ.. భారత్‌ మాత్రం మెరుగైన వృద్ధిరేటు కనబరిచిందని గుర్తు చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త హంగులు చేయబోతున్నామని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. వచ్చే పదేళ్లలో దేశంలోని ఐఐటీల్లో విద్యార్థుల సంఖ్య రెట్టింపు అవుతుందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగానే పాట్నా ఐఐటీ విస్తరణకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో అదనంగా 75 వేల మెడికల్‌ సీట్లు అందుబాటులోకి తెస్తామన్నారు. అలాగే, బిహార్‌లో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ ఏర్పాటు చేస్తామని ఆర్థికమంత్రి నిర్మలా వెల్లడించారు. స్ట్రీట్‌ వెండర్లకు కూడా రూ.30 వేలతో క్రెడిట్ కార్డులు మంజూరు చేయబోతున్నామన్నారు. బొమ్మల తయారీకి కూడా జాతీయ స్థాయిలో ప్రత్యేక పథకం రూపొందించినట్లు మంత్రి నిర్మలా సీతారామన్‌ వివరించారు. ఇక, రాష్ట్రాలకు కూడా రూ.1.5 లక్షల కోట్లు రుణాలు అందజేస్తామన్నారు కేంద్రమంత్రి. అలాగే, 50 ఏళ్ల కాలానికి గానూ వడ్డీ రహిత రుణాలు కూడా మంజూరు చేయబోతున్నట్లు నిర్మల చెప్పారు. సంస్కరణలు అమలు చేస్తే ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు.గిగ్‌ వర్కర్లకు గుర్తింపు కార్డులు అందజేస్తామని.. ఈ-శ్రమ్‌ పోర్టల్‌ కింద వాళ్లను నమోదు చేస్తామన్నారు. పీఎం జన్‌ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పనలో భాగంగా కోటి మంది గిగ్‌ వర్కర్లకు ప్రయోజనం కలుగుతుందన్నారు.

ఎగుమతుల్లో 45 శాతం వరకు ఎంఎస్‌ఎంఈల భాగస్వామ్యం ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఎంఎస్‌ఎంఈలకు వచ్చే ఐదేళ్లలో రూ.1.5 లక్షల కోట్లు అందజేస్తామని చెప్పారు. 27 రంగాల్లో స్టార్టప్‌లకు రుణాల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మంత్రి నిర్మల తెలిపారు. నమోదు చేసుకున్న మైక్రో ఇండస్ట్రీస్‌కు రూ.5 లక్షలతో క్రెడిట్ కార్డు మంజూరు చేస్తామన్నారు. మైక్రో సంస్థలకు తొలి ఏడాది 10 లక్షల రూపాయల వరకు క్రెడిట్ కార్డులు అందజేస్తామన్నారు. ఎంఎస్‌ఎంఈలకు రూ.10 వేల కోట్లతో ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ ఏర్పాటు చేస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. పట్టణ పేదల కోసం రూ.30 వేల పరిమితితో యూపీఐ లింక్డ్‌ క్రెడిట్‌ కార్డులు అందజేస్తామన్నారు. కొత్త ఉడాన్‌ పథకాన్ని ఇకపై మరో 120 రూట్లలో కూడా అమలు చేస్తామన్నారు. రాబోయే 10 సంవత్సరాల్లో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే ఈ కొత్త ఉడాన్‌ పథకం లక్ష్యమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com