అమెరికా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఏకంగా వందేళ్ల జైలు శిక్ష విధించింది. కనీసం పేరోల్ తీసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఈ శిక్ష విధించింది ఓ గే కపుల్‌కు. ఇంతటి కఠిన నిర్ణయం తీసుకునేందుకు కారణం ఉందని తెలిపింది కోర్టు. వారు చేసిన పనులు అలాంటివే అని తేల్చి చెప్పింది. విలయమ్, జాచరి జులాక్ ఇద్దరు గే కపుల్. అయితే వీరిద్దరు ఓ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నారు. వారిని పెంచి పెద్దచేసి ప్రయోజకులను చేస్తామని చెప్పిన ఈ జంట.. వారిని తీసుకెళ్లిన తర్వాత వారిపై లైంగిక దాడి చేశారు. అది కూడా పలుసార్లు చేసి వీడియోలు తీసి వాటిని వారి ఫ్రెండ్స్‌తో పంచుకున్నారు. దీంతో వాల్టన్ కౌంటీ డిస్ట్రిక్ అటార్నీ ఈ సంచలన శిక్ష విధించారు.
34 ఏళ్ల విలియమ్, 36 ఏళ్ల జాచరి జులాక్ 12, 10 ఏళ్లు ఉన్న ఇద్దరు సోదరుల్ని దత్తత తీసుకున్నారు. అట్లాంటా శివార్లలో ఉండే గే కపుల్.. ఆ పిల్లలకు నరకం చూపించినట్లు రుజువైంది. ఆ పిల్లలను రేప్ చేసినట్లు అటార్నీ తన తీర్పులో తెలిపారు. జాచరి బ్యాంకింగ్ సెక్టార్‌లో పనిచేస్తున్నాడు. ఇక విలియమ్ ఓ ప్రభుత్వ ఉద్యోగి. వీళ్లిద్దరూ లైఫ్‌లో బాగానే సెటిల్ అయ్యారు. కానీ వారి చేష్టలే ఇప్పుడు ఇబ్బందుల్లో పడేశాయి. 2002లోనే విలియమ్, జాచరిలను అరెస్టు చేశారు. అప్పటి నుంచి విచారణ జరుగుతుండగా.. వారిపై ఆరోపణలకు తగిన సాక్ష్యాలు లభించాయి. పిల్లలను సెక్యువల్‌గా వేధిస్తున్న ఫోటోలను ఓ ఫ్రెండ్‌కు షేర్ చేసింది ఈ జంట. అంతేకాదు పెడోఫైల్ సెక్స్ రింగులో ఆ పిల్లల్ని దించినట్లు కూడా తేలింది. ఆ పిల్లల గురించి సోషల్ మీడియాలో కూడా తప్పుడు ప్రచారం చేశారు.
నిజానికి ఈ కేసు విచిత్రంగా బయటికి వచ్చింది. చైల్డ్ పోర్న్ డౌన్ లోడ్ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని విచారిస్తుండగా ఈ పిల్లల గురించి తెలిసింది. తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఈ గే కపుల్ అకృత్యాలన్ని బయటికి వచ్చాయి. ఆ తర్వాత పిల్లలను పోర్న్ వీడియోల కోసం ఉపయోగించుకున్నట్టు కూడా తేలింది. దీంతో వందేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ తీర్పు ఇలాంటి దారుణాలకు పాల్పడే వారికి ఓ కనువిప్పు కావాలని చెబుతున్నారు అక్కడివారు.