31.2 C
Hyderabad
Sunday, May 3, 2026

Live Video

spot_img

పూర్తయిన అల్లు అర్జున్ విచారణ

అవసరమైతే మళ్లీ పిలుస్తాం: డీజీపీ
20 ప్రశ్నలు.. మూడున్నర గంటల విచారణ
అర్జున్ స్పందనపై పోలీసుల సంత్రుప్తి

సంధ్య థియేటర్ లో తొక్కిసలాట ఘటనలో హీరో అల్లు అర్జున్ విచారణ కాసేపటి క్రితం ముగిసింది. దాదాపు 20 ప్రశ్నలు సంధించి మూడు న్నర గంటల పాటు విచారించిన డీజీపీ బ్రుందం అర్జున్ స్టేట్ మెంట్ ను రికార్డుచేసింది. ప్రిపేర్ చేసిన రిపోర్టును ఆయనకే చూపించి సంతకం కూడా తీసుకుంది. తిరిగి అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని కూడా చెప్పింది. అయితే మహిళ మరణం గురించి థియేటర్ లో ఉండగా తనకు తెలియదని చెప్పడంతో దానిపైనే ఎక్కువగా విచారించినట్లుసమాచారం.

ఆ ఒక్కటీ అడక్కు..

ఆరోజు అర్జున్ కు థియేటర్ లో ఉండగా సమాచారం అందించానని చెప్పిన పోలీసు అధికారి కూడా విచారణలో ఉన్నారని అయితే ఈ ప్రశ్నలకు మాత్రం అర్జున్ మౌనం దాల్చినట్లు మిగిలిన అన్ని విషయాలకు సమాధానమిచ్చినట్లు విచారణకు సహకరించినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన కొన్నివీడియోలు కూడా అల్లు అర్జున్ కు చూపించినట్లు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.మొత్తం 18 మందిని నిందితులుగా తేల్చిన పోలీసులు ఏ 12 నుంచి ఏ 15 వరకూ ఉన్న నిందితులే ఘటన జరగడానికి కీలకంగా భావిస్తున్నారు. దీనిలో అల్లు అర్జున్ పర్సనల్ బౌన్సర్ , ఇంకా సంధ్యా ధియేటర్ ఓనర్,పార్టనర్లు, సహ పార్టనర్లు, మేనేజర్, గేట్ కీపర్ లోయర్ బాల్కనీ, అల్లు అర్జున్ మేనేజర్, పర్సనల్ అసిస్టెంట్,బాడీగార్డులతో పాటు ఏ 18 గా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలను నిందితులుగా చేర్చారు. అయితే ఏ 12 నుంచి ఏ15 వరకూ ఘటన జరిగేందుకు దోహదపడ్డారని పోలీసులు భావిస్తున్నందున అల్లుఅర్జున్ ఈ కేసు నుంచి సులభంగా బయట పడతారా అన్నది తేలాలి. రిమాండ్ రిపోర్ట్ ను అల్లు అర్జున్ కి స్పష్టంగా చూపించినట్లుగా తెలుస్తోంది.

అవసరమైతే సీన్ రీ కనస్ట్రక్షన్

ఈరోజే సంధ్యాథియేటర్ కు సీన్ రికనస్ట్రక్షన్ కోసం తీసుకెళతారని భావించినా, పోలీసులు ఎందుకో ఆ నిర్ణయాన్ని వాయిదావేశారు. అల్లు అర్జున్ ను మళ్లీ విచారణకు పిలిస్తే అప్పుడు తీసుకెళ్లే అవకాశాలున్నాయి. అల్లు అర్జున్ విచారణ ముగించుకుని బయటకు రాగానే తండ్రి అల్లు అరవింద్ ఊపిరి పీల్చుకున్నారు. అప్పటి వరకూ ఎంతో ఉత్కంఠగా ఉన్న అరవింద్ కాస్త కూల్ అయి ఇంటికి బయల్దేరారు. అర్జున్ వెంట ఆయన లీగల్ అడ్వకేట్ అశోక్ రెడ్డి ఉన్నారు. విచారణకు లోపలికి వెళ్లే టప్పుడు, తిరిగి బయటకు వచ్చి కారెక్కేటప్పుడు అర్జున్ సీరియస్ గా కనిపించారు. అందరికీ నమస్కరిస్తూ కారెక్కారు.

ఆంటోనీ అరెస్ట్

అల్లూ అర్జున్ బౌన్సర్లలో కీలకమైన వ్యక్తి ఆంటోనీని పోలీసులు అరెస్టు చేశారు. ఆరోజు థియేటర్ గేట్లు తీయగానే అక్కడే నిలబడి ఉన్న రేవతిని, ఆమె బాబుని తోసేసి విచక్షణా రహితంగా తొక్కేసినట్లు వీడియోలలో స్పష్టంగా ఉండటంతో ఆంటోనీని అదుపులోకి తీసుకున్నారు.
అల్లు అర్జున్ ఇంటికి పరదాలు
తాజా ఘటనల నేపధ్యంలో అల్లు అర్జున్ ఇంటికి పరదాలు కట్టారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగానే ఇది అమర్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com